చైనా యాప్స్ నిధుల మళ్లింపు.. రంగంలోకి ఎన్ఐఏ - MicTv.in - Telugu News
mictv telugu

చైనా యాప్స్ నిధుల మళ్లింపు.. రంగంలోకి ఎన్ఐఏ

September 20, 2020

cn cvgb

భారత పౌరుల భద్రత రీత్యా కేంద్రం 118 యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. వీటిలో చైనాకు చెందినవే 106 యాప్స్ ఉన్నాయి. అయితే చైనా యాప్స్ విషయంలో ఎన్ఐఏ (National Investigation Agency) రంగంలో దిగింది. ఆన్‌లైన్ గేమ్స్ పేరుతో చైనా ఆప్స్ నిధులు మళ్లిస్తున్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని సీసీఎస్‌లో చైనా యాప్‌పై కేసు నమోదు అయింది. రంగంలోకి దిగిన ఎన్ఐఏ.. ఈ యాప్స్ కార్యకలాపాల వెనుక ఉగ్రవాద కుట్రకోణం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఆన్‌లైన్ చైనా యాప్స్ మీద ఈడితో పాటు ఐటీ కూడా విచారణ జరుపుతున్నాయి. ఇప్పుడు ఈ యాప్స్ విషయంలో ఎన్ఐఏ కూడా రంగంలో దిగడంతో చర్చనీయాంశంగా మారింది.

సీసీఎస్ దగ్గరున్న వివరాలను తీసుకున్న ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. రూ.2 వేల కోట్ల పైచిలుకు నగదు చైనాకు సదరు కంపెనీ తరలించినట్టు గుర్తించారు. అనధికారికంగా వేల కోట్ల రూపాయలను చైనాకు కంపెనీలు తరలించినట్టు చెబుతున్నారు. మరోవైపు యాప్స్ పేరిట భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లుగా ఎన్ఐఏ అనుమానం వ్యక్తంచేస్తోంది.