ఇప్పటికి తెలిసొచ్చింది.. చైనాలో కుక్క,పిల్లి మాంసంపై నిషేధం - MicTv.in - Telugu News
mictv telugu

ఇప్పటికి తెలిసొచ్చింది.. చైనాలో కుక్క,పిల్లి మాంసంపై నిషేధం

April 2, 2020

China Ban Dog And Cat Meat Trade

అనుభవిస్తే కానీ ఏది తెలిసి రాదని పెద్దలు చెబుతుంటారు. చైనా విషయంలోనూ అలాగే జరిగింది. వింత ఆహారపు అలవాట్లతో ప్రపంచ దేశాలపై కొత్త వైరస్ వదిలి ఛీత్కారాలు ఎదుర్కొన్న చైనీయులు ఇప్పుడు మేల్కొన్నారు. ఇక నుంచి తమ దేశంలోని షెన్‌జైన్ నగరంలో కుక్కలు,పిల్లులు,బల్లులు,పాముల మాంసం తినడంపై నిషేధం విస్తున్నట్టు ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి ఈ కొత్త చట్టం అమలులోకి తీసుకువచ్చేలా అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రాణ సంకటంగా ఈ ఆహారం మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

పాములు, బల్లులు, కుక్కలు, పిల్లులను పెంచడం, మాంసం విక్రయించే ప్రధాన నగరం షెన్‌జెన్ నగరంలో తాత్కాలిక నిషేధం విదిస్తున్నట్టు పేర్కొన్నారు. వూహాన్ నగరంలో జంతు వధశాల కేంద్రంగా కరోనా వైరస్ వ్యాపించిందనే వాదనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆవులు, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్దల మాంసం విక్రయానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు.

చైనాలో మొట్టమొదటి సారి కుక్కలు,పిల్లుల మాంసంపై నిషేధం విధించిన నగరంగా షెన్‌జెన్ రికార్డు సృష్టించింది. ఇక్కడ ప్రతి ఏటా దాదాపు 10 మిలియన్ల కుక్కలు, 4 మిలియన్ పిల్లులను చంపి మాంసం విక్రయిస్తుంటారు. కానీ కరోనా మహమ్మారికి వధశాలలే కారణమనే వాదనలు పుట్టుకురావడంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాగా,ఇప్పటికే ఈ అలవాటు ఉన్న తైవాన్, హాంకాంగ్ దేశాల్లోనూ వీటి మాంసం విక్రయించడం నిషేధించిన సంగతి తెలిసిందే.