భారత మీడియాపై వేటువేసిన చైనా.. - MicTv.in - Telugu News
mictv telugu

భారత మీడియాపై వేటువేసిన చైనా..

June 30, 2020

newspapers

భారత్-చైనా దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెల్సిందే. ఇటీవల లద్ధాఖ్ లోని గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అలాగే దాదాపు 45 మంది చైనా సైనికులు మరణించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్ ప్రభుత్వం చైనాకుచెందిన  59 మొబైల్ యాప్ లను నిషేధించింది.

దీంతో భారత్‌కు చెందిన వార్త పత్రికలు, వెబ్‌సైట్లను ప్రజలకు దూరం చేసేందుకు చైనా చర్యలు ప్రారంభించింది. భారత వార్తాపత్రికలు, వెబ్‌సైట్లపై చైనా‌ నిషేధం విధించింది.‌ కానీ, భారత్ మాత్రం చైనాకు చెందిన వార్త పత్రికలను, వెబ్ సైట్ లను నిషేధించలేదు. కానీ, చైనా మాత్రం ఇలా తన వక్ర బుద్ధిని చాటుకుంది. బీజింగ్‌లోని భారత ఎంబసీ సమాచారం ప్రకారం.. చైనాలో భారత మీడియాకు చెందిన వెబ్‌సైట్లను ఇక మీదట వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌(వీపీఎన్‌) సర్వర్‌ ద్వారా మాత్రమే వీక్షించేలా నిబంధనలు మార్చినట్లు తెలుస్తోంది. ఇక ఇండియన్‌ టీవీ ఛానళ్లను ప్రస్తుతానికి ఐపీ టీవీ ద్వారా వీక్షించవచ్చు. ఐఫోన్లు, డెస్క్‌టాప్‌ల్లో ఎక్స్‌ప్రెస్‌ వీపీఎన్‌ గత రెండు రోజులుగా ఇక్కడ పనిచేయడం లేదు. ప్రపంచంలోనే చైనాలో ఆన్‌లైన్‌ సెన్సార్‌షిప్‌ ఎక్కువగా ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా రాసే వెబ్‌సైట్లపై నిషేధం విధించడం ఇక్కడ పరిపాటే. ఇప్పటికే చైనా 10 వేల వెబ్ సైట్ లను నిషేధించింది.