China celebrating Abe's death..Posts go viral
mictv telugu

అబే మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న చైనా..పోస్టులు వైరల్

July 9, 2022

China celebrating Abe's death..Posts go viral

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే శుక్రవారం ఉదయం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అబే మరణవార్తను విన్న పలు దేశాల అధ్యక్షులు నివాళులు అర్పిస్తుంటే చైనా దేశ ప్రజలు మాత్రం పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో విచిత్రమైన పోస్టులు పెడుతూ, అబేపై అనేక రకాల వ్యాఖ్యలు చేస్తున్నారని ఆస్ట్రేలియాకు చెందిన చైనీస్ పొలిటికల్ కార్టూనిస్ట్, ఆర్టిస్ట్, హక్కుల కార్యకర్త బడియెకావో ట్విట్టర్‌‌లో స్క్రీన్ షాట్‌లను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్టులు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి.

”ప్రపంచంలోని పలు దేశాల అధ్యక్షులు, ప్రజలు జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నివాళులు అర్పిస్తుంటే, చైనా మాత్రం సంబరాలు చేసుకుంటోంది. షింజో హత్యను కొందరు చైనీయులు సామాజిక మాధ్యమాల ద్వారా సెలబ్రేట్ చేసుకుంటే, మరికొందరు హంతకుడిని ‘హీరో’గా అభివర్ణిస్తున్నారు. ‘వీబో’, ‘వియ్‌చాట్’లలో డెత్ విషెస్ అని కొందరు. మరికొందరు ‘థ్యాంక్యూ యాంటీ జపాన్ హీరో, నేను నవ్వొచ్చా?’ అని కామెంట్ చేస్తే, ‘పార్టీ టైమ్’ అంటూ మరొకరు రిప్లై ఇచ్చారు” అని బడియెకావో తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

షింజో అబే.. జన్మస్థలం టోక్యో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రాజనీతి శాస్త్రంలో పట్టభద్రుడు. జపాన్ ప్రధానిగా 2008లో తొలిసారిగా పదవిని చేపట్టారు. అప్పటికి షింజో వయసు 52 ఏళ్లు. అయితే, పెద్ద పేగు సమస్యతో ఏడాదికే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన తర్వాత ఆరేళ్లలో ఆరుగురు ప్రధానులు మారారు. మళ్లీ 2012లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, ఏకధాటిగా ఎనిమిదేళ్లపాటు కొనసాగారు. జపాన్‌లో అత్యధిక కాలం ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిగా చరిత్ర సృష్టించి, ప్రపంచంలోనే మూడో ఆర్ధిక శక్తిగా ఉన్న దేశానికి రాజకీయ స్థిరత్వాన్ని సమకూర్చారు.