భారతీయ డాక్టర్‌కి చైనా నివాళి.. కారణమిదే - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయ డాక్టర్‌కి చైనా నివాళి.. కారణమిదే

October 12, 2020

hmnhmn

భారత్‌, చైనాల మధ్య పచ్చిగడ్డి వేస్తె బగ్గుమనేంత శత్రుత్వం కొనసాగుతోంది. సరిహద్దులో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలగొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చైనా ఓ భారతీయ డాక్టర్‌కి నివాళి అర్పించింది. ఆయనే డాక్టర్ ద్వారకానాథ్‌ కోట్నిస్‌. 1938లో చైనా, జపాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో డాక్టర్ ద్వారకానాథ్‌ కోట్నిస్ చైనా సైనికులకు వైద్య సేవలు అందించారు. దానికి గుర్తుగా చైనా ఇప్పటికీ ఆయన్ని స్మరించుకుంటోంది.  

ఆ యుద్ధం సమయంలో భారత్‌ నుంచి చైనాకు ఐదుగురు డాక్టర్లు వెళ్లారు. వారిలో నలుగురు డాక్టర్లు భారత్ తిరిగి వచ్చారు. కానీ, డాక్టర్ ద్వారకానాథ్‌ కోట్నిస్ మాత్రమే అక్కడే ఉండి తన వైద్య సేవలను కొనసాగించారు. డాక్టర్ ద్వారకానాథ్‌ కోట్నిస్ 1942లో అక్కడే మరణించారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం చైనా ప్రభుత్వం ఆయన జయంతి రోజున సంస్మరణ సభ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది డాక్టర్‌ ద్వారకానాథ్‌ కోట్నిస్‌పై డాక్యుమెంటరీని కూడా ఆవిష్కరించారు.