కరెన్సీ నోట్లతోనూ కరోనా వైరస్ ముప్పు! - MicTv.in - Telugu News
mictv telugu

కరెన్సీ నోట్లతోనూ కరోనా వైరస్ ముప్పు!

February 16, 2020

coronaaa

కరోనా వైరస్ చైనా దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి 1600 మందికి పైగా మృతిచెందారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజలంతా మాస్క్ ధరిస్తున్నారు. తాజాగా  కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందనే ప్రచారం చైనాలో జోరుగా సాగుతోంది. కరెన్సీ ఒకరి నుంచి మరొకరికి చేతులు మారినప్పుడూ ఈ వైరస్ వ్యాపిస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. దీంతో కరెన్సీ నోట్లపై ఆంక్షలు మొదలుపెట్టారు. 

కరెన్సీని తగ్గించి నెట్‌ బ్యాంకింగ్‌‌లను వాడుకోవాలని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. కరెన్సీ నోట్లను తాకడం వల్ల కూడా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందనే ఉద్దేశంతో భారీ ఎత్తున నోట్లను సేకరించి, గొడౌన్లకు తరలిస్తున్నారు. కరెన్సీని ఖాతాదారులకు అందజేసేటప్పుడు వైరస్‌ లేకుండా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలని పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు, ఆన్‌లైన్‌ సేవలను మరింత వినియోగించుకోవాలని కోరింది. కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లోని సరఫరా చేయడానికి ముందు పాత నోట్లను కనీసం 14 రోజుల పాటు అతినీలలోహిత కిరణాలు లేదా వేడిచేయడం ద్వారా శుభ్రం చేయనున్నట్టు పీబీసీ వెల్లడించింది. కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థల మధ్య కరెన్సీ లావాదేవీలను నిలిపివేశారు.