China elections Xi Jinping Becomes President For The Third Time
mictv telugu

జిన్‌పింగ్ రికార్డు.. మావో తర్వాత అతడే..

March 10, 2023

China elections Xi Jinping Becomes President For The Third Time
చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీ పప్పులు మాత్రమే ఉడుకుతాయని అందరికీ తెలిసిందే. చైనానే కాదు, కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న చాలా దేశాల్లో విపక్షాలకు పూచిక పుల్ల విలువ ఉండదు. దీంతో పార్టీపై పట్టున్నవాళ్లే దశాబ్దాల తరబడి పదవుల్లో కొనసాగుతుంటారు. చైనాలో కూడా అదే జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వరుసగా మూడోసారి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. మావో తర్వాత వరుసగా మూడోసారి ఎన్నికైన ఘనతతే ఆయనదే.

ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవిని చేపట్టాలన్న నిబంధనను జింన్‌పింగే 2018లో ఎత్తిపారేశారు. శుక్రవారం పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సభ్యు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 3 వేలమంది సభ్యులున్న కాంగ్రెస్‌లో ఆయనకు 2,952 ఓట్లు పడ్డాయి. జిన్‌పింగ్ తప్ప మరో అభ్యర్థి లేకపోవడంతో ఆయనే విజేతగా నిలిచారు. చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్‌గానూ ఆయన మూడోసారి ఎన్నికయ్యారు. పార్లమెంటు కొత్త అధ్యక్షుడిగా జావో లెజీ, ఉపాధ్యక్షుడిగా హాన్ జెంగ్‌లను ఎన్నుకున్నారు.