భారతీయ విద్యార్థులకు చైనా గుడ్‌న్యూస్.. మళ్లీ రండి - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయ విద్యార్థులకు చైనా గుడ్‌న్యూస్.. మళ్లీ రండి

June 15, 2022

భారతదేశ విద్యార్థులకు చైనా ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. భారతీయుల వీసాలపై విధించిన రెండేళ్ల నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కరోనా సమయంలో భారతీయుల వీసాలపై చైనా ప్రభుత్వం రెండేళ్లపాటు నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. దాంతో చైనాలో పని చేస్తున్న భారతీయ వృత్తి విద్యా నిపుణులు, వారి కుటుంబాలు రెండేళ్లుగా ఇండియాలోనే ఉండిపోయారు. ఈ క్రమంలో భారతీయుల వీసాలపై తాజాగా చర్చలు జరిపిన చైనా ప్రభుత్వం.. వీసాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ, భారత్‌లో ఉండిపోయిన కుటుంబాలు మళ్లీ చైనాకు రావాలని పిలుపునిచ్చింది. ఈ ప్రకటనతో చైనా కాలేజీల్లో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు ఉరట లభించింది.

కరోనా పుట్టిన దేశంగా చైనా ప్రభుత్వం పేరుగాంచిన విషయం తెలిసిందే. గత మూడేండ్లుగా చైనా దేశ ప్రజలు ఆహారం దొరకక, బయటికి వెళ్లలేక నానా అవస్థలు పడ్డారు. దేశంలో కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చేంతవరకు ఇతర దేశాలకు చెందిన వారి వీసాలను అప్పట్లో చైనా రెండేళ్లపాటు నిషేధిస్తూ, ఆదేశాలు జారీ చేసింది. దాంతో లక్షల మంది విద్యార్థులు, భారతీలయులు, విదేశీయులు చైనాను విడిచి స్వదేశాలకు వెళ్లారు.

ఈ క్రమంలో తాజాగా వీసాలపై చర్చోపచర్చలు జరిపిన చైనా ప్రభుత్వం.. వీసాలపై విధించిన నిషేధ ఆజ్జలను ఎత్తివేసింది. అనంతరం చైనాలో విద్యను అభ్యసించే విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునే వాళ్లంతా మళ్లీ చైనాకి రావాలని పిలుపునిచ్చింది. చైనాకు రావడానికి భారతీయ విద్యార్థులకు మళ్లీ వీసాలు ఇవ్వడానికి చైనా సిద్ధమైంది.