రాహుల్ గాంధీపై ‘హనీట్రాప్’.. ఆ మహిళ చైనా రాయబారి - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ గాంధీపై ‘హనీట్రాప్’.. ఆ మహిళ చైనా రాయబారి

May 3, 2022

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ నైట్ పబ్‌లో ఉన్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అందులో రాహుల్‌తో పాటు ఓ మహిళ కూడా ఉన్నారు. తాజాగా ఆమె వివరాలు తెలిశాయి. ఆమె పేరు హౌ యాంక్వీ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. నేపాల్‌లో చైనా దౌత్యవేత్తగా ఆమె పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ వీడియో నేపథ్యంలో చైనా హనీట్రాప్ ఎత్తుగడలు మరోసారి చర్చకు వచ్చాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆమె గతంలో నేపాల్‌లో చేసిన రాజకీయ ఎత్తుగడలను గుర్తు చేశారు. అంతేకాక, నరేంద్ర మోదీ యూరప్ పర్యటనపై కాంగ్రెస్ అనవసర విమర్శలు చేసిందనీ, ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నేత వివాదంలో చిక్కుకున్నాడని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. కాగా, ఇప్పటివరకు రక్షణ, అధికార యంత్రాంగాలలోని ముఖ్యులపైనే హనీట్రాప్ జరిగేది. తాజాగా రాహుల్ గాంధీపై ఈ ఆరోపణలు రావడంతో చైనా మన రాజకీయ నాయకులను అమ్మాయిలను ఎరగా వేసి లోబరుచుకుంటోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, హౌ యాంక్వీని జీ జిన్ పింగ్ ప్రత్యేకంగా హనీట్రాప్ కోసమే వాడుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈమె గతంలో ఎక్కడెక్కడ, ఏమేం చేసిందనే వివరాలను అంతర్జాతీయ విశ్లేషకులు తవ్వి తీస్తున్నారు.