10 రోజుల్లోనే 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం.. ఆశ్చర్యపోతున్న జనం - MicTv.in - Telugu News
mictv telugu

10 రోజుల్లోనే 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం.. ఆశ్చర్యపోతున్న జనం

January 27, 2020

cfb v

సాధారణంగా ప్రభుత్వాలు ఆస్పత్రులు నిర్మించాలనుకుంటే ఏళ్లు గడిచినా పూర్తి కాదు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ చైనాలో మాత్రం 1000 పడకల గదిని ఏకంగా 10 రోజుల్లోనే నిర్మించాలని నిర్ణయించారు. ఇంత పెద్ద ఆస్పత్రిని కేవలం ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం అంటే సాహసమనే చెప్పాలి. కానీ దీనికి కోసం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఆ దేశం వాడుకోవడం విశేషం. 

ప్రీ ఫ్యాబ్రికేషన్ విధానంలో దీన్ని నిర్మించనున్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం వందలాది జేసీబీలో ఆ ప్రాంతంలోకి చేరుకొని పునాది పనులు వేగంగా పూర్తి చేస్తున్నాయి. కావాల్సినంత తొందరగా దీన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల నిపుణులను కూడా అక్కడికి రప్పించి వేగంగా పనులు చేస్తున్నారు. ఇంత త్వరగా ఆస్పత్రి పూర్తి చేయడం వెనక ఓ అత్యవసరం కూడా ఉంది. ఇక్కడ గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇది వేరే వారికి వ్యాపించకుండా బాధితులను ప్రత్యేక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించనున్నారు. ఇప్పటికే చాలా ఆస్పత్రులు టెంట్ల కింద చికిత్స అందిస్తుండటంతో ప్రత్యేకంగా ఆస్పత్రి నిర్మించాలని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ సూచించడంతో దీన్ని మొదలుపెట్టారు.