వికీపీడియాపై చైనా సంపూర్ణ నిషేధం.. - MicTv.in - Telugu News
mictv telugu

వికీపీడియాపై చైనా సంపూర్ణ నిషేధం..

May 16, 2019

గూగుల్‌, ఫేస్‌బుక్‌, లింక్డ్‌‌ఇన్‌లపై నిషేధం విధించిన చైనా, తాజాగా వికీపీడియాపై కొరడా ఝళిపించింది. దానిపై నిషేదం విధిస్తున్నట్టు ప్రకటించింది. గతంలో వికీపీడియా చైనీస్‌ వెర్షన్‌ను మాత్రమే ఆదేశం నిషేధం విధించింది.  తాజాగా అన్ని భాషల వికీపీడియా వెర్షన్లపై నిషేధం విధించింది. చైనాకు చెందిన దలైలామా, తియానమెన్ మసీద్ వంటి సున్నితమైన అంశాలను సెర్చ్ చేయడంపై కూడా ఆంక్షలు విధించింది. ఈమేరకు చైనా ప్రజల ఆలోచనలకు సరైన దిశానిర్దేశం చేసేలా స్వంత ఎన్‌సైక్లోపీడియా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు తమకు ఎలాంటి నోటీసులు అందలేవని వికీపీడియా స్పష్టంచేసింది.

China is blocking Wikipedia in every language

తమ దేశ సంస్కృతిని పరిరక్షించుకునే చర్యల్లో భాగంగా చైనా ఈ నిర్ణయం తీసుకుందట. ఇంటర్నెట్ వల్ల చైనీయులు విదేశీ ప్రభావంలో పడే ప్రమాదం వుందని.. దానిని అరికట్టడానికి ‘కల్చరల్ గ్రేట్ వాల్’ను రూపొందిస్తోందని సమాచారం. చైనాలో ఇంటర్నెట్ వ్యవహారంపై చాలా కఠినమైన నియంత్రణ వుంది. ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉంటే తప్ప చైనాలో ఫేస్‌బుక్, ట్విటర్‌లను యాక్సెస్ చేయలేరు. చైనా కఠిన నిబంధనల నేపథ్యంలో వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌-2019లో 180 దేశాల జాబితాలో చైనా 177 ర్యాంకు పొందింది. దీన్నిబట్టి అక్కడ భావప్రకటనా స్వేచ్ఛపై ఎంత కఠినమైన ఆంక్షలు ఉన్నాయో తెలుస్తోంది. చైనాలో ఇప్పటివరకు సుమారు 700 మిలియన్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారు. చైనా మాదిరి టర్కీలో కూడా వికీపీడియాపై నేషేధం ఉంది.