చైనాలో కరోనా దారుణంగా ఉంది. రోజూ చాలామంది కోవిడ్ వల్ల చనిపోతున్నారని చాలా వార్తలు వస్తున్నాయి. కానీ చైనా ప్రభుత్వం మాత్రం వారం రోజుల్లో ఒకే ఒక్క మరణం చోటు చేసుకుందని ప్రకటించింది. కానీ సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మాత్రం మృతదేహాలతో కుటుంబీకులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఇక్కడి పరిస్థితిని తెలియజేస్తూ అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగల్ డింగ్ షేర్ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
⚠️THERMONUCLEAR BAD—Hospitals completely overwhelmed in China ever since restrictions dropped. Epidemiologist estimate >60% of 🇨🇳 & 10% of Earth’s population likely infected over next 90 days. Deaths likely in the millions—plural. This is just the start—🧵pic.twitter.com/VAEvF0ALg9
— Eric Feigl-Ding (@DrEricDing) December 19, 2022
చైనాలో శ్మశానాల దగ్గర శవాలతో ఫ్యామిలీ మెంబర్స్ గంటలుపాటూ వేచి చూస్తున్నారు. మరోవైపు మార్చురీ హాస్పటల్స్ దగ్గర మార్చురీలు కూడా నిండిపోయి ఉన్నాయి. అక్కడ కారిడార్లలో వరుసగా మృతదేహాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాదికి చైనాలో 20 లక్షల కోవిడ్ మరణాలు జరుగుతాయని ఎరిక్ ఫీగల్ డింగ్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోజూ కోవిడ్ కేసులు సంఖ్య లక్షల్లో ఉంటోందని అంటున్నారు.
Overflowing hospital morgues—Fever meds shortage, oxygen tanks EMPTY, 🏥 overwhelmed, blood shortage, death tolls soaring among elderly ==>lots of body bags—even at a top Beijing hospital too. Worsening #COVID19 yet to come. But still 0 official deaths.
🧵pic.twitter.com/Zy7TtidU8U— Eric Feigl-Ding (@DrEricDing) December 24, 2022
చైనా మాత్రం ఇవేవీ నిజం కాదంటోంది. వాళ్ళు చూపిస్తున్న లెక్కలు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. కోవిడ్ ఆంక్షలు ఎత్తేసిన తర్వాత కేవలం ఏడుగురు మాత్రమే మరణించారని అధికారికంగా చెబుతున్నారు. గత మూడేళ్ళల్లో కూడా ఇప్పటివరకు 5241 మంది మాత్రమే చనిపోయారని చైనా లెక్కలు చూపిస్తోంది. చైనా ఇలా మరణాల సంఖ్య దాచడం, కోవిడ్ కేసులు కూడా తక్కువ చేసి చూపించడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కచ్చితమైన సమాచారం ఇవ్వాలని ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఇలా దాచి ఉంచడం మంచిది కాదని చెబుతోంది.