China looking at Indian market for approved Covid-19 drugs as demand increases
mictv telugu

చైనాలో ఇండియన్ మందులకు భారీ డిమాండ్..

December 29, 2022

China looking at Indian market for approved Covid-19 drugs as demand increases

కరోనాతో చైనా దేశం అల్లాడుతోంది. పెరుగుతున్న కేసులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కరోనా సోకి వేలాది మంది చైనీయులు ప్రాణాలు కోల్పోతున్నారు. స్మశానాలు దగ్గర సైతం క్యూ లైన్స్ కనబడుతున్నాయి. స్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. కోవిడ్ పేషంట్లకు సరిపడ మందులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెడిషన్‎ను బ్లాక్ మార్కెట్ ద్వారా కొనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా భారతదేశం ఔషధాలకోసం చైనీయులు ఎగబడుతున్నారు.

ప్ఫైజర్ కంపెనీ తయారీ చేసిన పాక్స్‌లోవిడ్, చైనా కంపెనీ జెన్యూన్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న హెచ్ఐవీ డ్రగ్ అజ్వుడైన్‌లకు మాత్రమే అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రెండు కోవిడ్-19 యాంటీవైరల్స్ కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో చైనీయలకు ఇబ్బంది ఏర్పడి..బ్లాక్ మార్కెట్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ మందులనే కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చైనాలో అమ్మేందుకు అనుమతిలేని ఇండియా జెనరిక్ ఔషధలను చైనీయులు కొనుగోలు చేస్తున్నారు. ఇక బ్లాక్ మార్కెట్ లో భారతీయ మందులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడినట్లు చైనా మీడియా వెల్లడించింది. ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాటిస్ అక్రమంగా అమ్ముడవుతున్నాయని తెలిపింది. అయితే చైనా వైద్య నిపుణులు ఈ మందులు కారణంగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.