China loses Rs. 75 thousand crores in Diwali business
mictv telugu

భారతీయుల్లో మార్పు.. చైనాకు 75 వేల కోట్ల నష్టం

October 28, 2022

China loses Rs. 75 thousand crores in Diwali business

దీపావళి సందర్భంగా దేశ వ్యాప్తంగా కొనుగోళ్లు భారీగా జరిగాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న మార్కెట్ దీపావళి రాకతో ఒక్కసారిగా పుంజుకుంది. కేవలం ధంతేరాస్ రోజు సుమారు రూ. 25 వేల కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఈ మేరకు వివరాలు వెల్లడించింది.

భారీ ఎత్తున గోల్డ్, కాయిన్స్, నోట్స్, శిల్పాలు, పాత్రల అమ్మకాలు జరిగాయని తెలిపింది. పండుగ విక్రయాలు లక్షన్నర కోట్లకు మించి ఉంటాయని పేర్కొంది. మరో విశేషమేంటంటే.. ఈ సారి భారతీయ వినియోగదారులు దేశీయ వస్తువులను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఇష్టపడ్డారని, దీని వల్ల చైనాకు రూ. 75 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. బంగారంతో పాటు ఆటోమొబైల్, కంప్యూటర్ సంబంధిత వస్తువులు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, దుస్తులు వంటి రంగాల్లో గణనీయమైన వ‌ృద్ధి కనపడిందన్నారు. గతేడాదితో పోలిస్తే బంగారం డిమాండ్ 80 శాతం పెరిగిందని, అదే సమయంలో బంగారం దిగుమతులు తగ్గాయని వివరించింది.