Home > Featured > ‘లవ్ ఎక్స్‌ప్రెస్’ పెళ్లికాని యూత్‌కు సరికొత్త పథకం

‘లవ్ ఎక్స్‌ప్రెస్’ పెళ్లికాని యూత్‌కు సరికొత్త పథకం

China Love Train..

పెళ్లి చేసుకోవాలంటే తెలిసిన వారికో.. మ్యాట్రీమోనినో సంప్రధించి వధూవరులను వెతకమని చెప్పడం కామన్. కానీ చైనా మాత్రం వెరైటీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అమ్మాయిలు, అబ్బాయిలు తమకు కావాల్సిన వారిని ఎంచుకోవడానికి ‘లవ్ ఎక్స్‌ప్రెస్’ పథకాన్ని ప్రవేశపెట్టారు. పెళ్లికాని యువతి, యువకులందరినీ ఒకరైలులో ఎక్కించి వారిలో కావాల్సిన వారిని ఎంపిక చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఈ పథకానికి అక్కడ మంచి ఆధరనే లభిస్తోంది.

లవ్ ఎక్స్ ప్రెస్' పేరిట ప్రత్యేక రైలును రూపొందించారు. దాంట్లో ఎంపిక చేసిన 1000 మంది యువకులు, 1000 మంది యువతులు ప్రయాణించే సౌలభ్యం కల్పించారు. ఈ ప్రయాణంలో అందులో ఉన్న వారు ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ తమ ఇష్టా ఇష్టాలు పంచుకొని కావాల్సిన భాగస్వామిని ఎంపిక చేసుకోవచ్చు. 10 కోచ్‌ లు ఉండే ఈ రైలు మ్యాచ్ మేకింగ్ సర్వీస్ లను అందిస్తోంది.

మూడేళ్ల క్రితం మూడు వేల మంది యువతీ యువకులు ప్రయాణించారు. వీరిలో కొంత మంది వివాహాలు చేసుకోగా మరి కొంత మంది రిలేషన్ షిప్‌లో ఉన్నారు. ఈ పథకం ద్వారా తమకు మంచి భార్య దొరికిందని కొందరూ, మంచి లవర్ దొరికిందని ఇంకొదరూ చెప్పడం విశేషం. ఏది ఏమైనా ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం ప్రత్యేక దృష్టిపెట్టిన చైనా ఇప్పుడు ఆ దేశంలో ఎక్కువగా వృద్ధుల సంఖ్య పెరగడంతో యువతను ఈ విధంగా ప్రోత్సహించడం విశేషం.

Updated : 3 Sep 2019 12:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top