చైనా భాష ఇక పాకిస్తాన్‌లో అధికార భాష.. దేనికి సంకేతం? - MicTv.in - Telugu News
mictv telugu

చైనా భాష ఇక పాకిస్తాన్‌లో అధికార భాష.. దేనికి సంకేతం?

February 20, 2018

శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న వ్యూహాన్ని పాకిస్తాన్ చక్కగా అమలు చేస్తోంది. భారత్‌కు శత్రువైన చైనాను అక్కున చేర్చుకుంటోంది. చైనా భాష మాండరీన్‌ను తమ దేశ అధికార భాషల్లో ఒకటిగా పాకిస్తాన్ ప్రకటించింది. వన్ రోడ్ వల్ బెల్ట్ గ్లోబల్ ప్రాజెక్టులో భాగంగా  చైనా- పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పనులు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు సంబంధించి భాషల విషయంలో సమస్య రాకుండా మాండరీన్‌ను తమ అధికారిక భాషల్లో ఒకటిగా గుర్తించినట్లు పాక్ పేర్కొంది.  పాక్లో ఇంగ్లిష్, ఉర్దూ, అరబిక్ వంటి భాషలు కూడా మాట్లాడతారు. తాజాగా మాండరీన్ వీటి చెంత చేరడం వెనక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా తమకు అండగా ఉందని భారత్‌ను హెచ్చరించేందుకు పాక్ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

కాగా, ఈ నిర్ణయంపై పాక్‌లో నిరసన స్వరాలు వినిపిస్తున్నా. పాక్ సర్కారు.. పంజాబీ, పష్తూన్ వంటి స్థానిక భాషలను ఇంకా అధికారికంగా గుర్తించడం లేదని, చైనా భాషను మాత్రం ఇలా అవసరాల కోసం అధికారిక భాషగా ప్రకటించిందని దౌత్యవేత్త  హుస్సేన్ హక్కానీ ట్వీట్ చేశారు.  అయితే మాండరీన్ వల్ల చైనా నుంచి పలు రకాల సాయం అందుతుందని ఆ భాష నేర్చుకుంటే చైనాలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయమని సర్కారు చెబుతోంది.