యుద్దం అంటే చైనాకూ భయమే....ఎందుకో తెలుసా...... - MicTv.in - Telugu News
mictv telugu

యుద్దం అంటే చైనాకూ భయమే….ఎందుకో తెలుసా……

July 6, 2017

చైనా మీడియా ఇండియా గురించి… ఇక్కడి పాలకులు, రాజకీయాల గురించి రోజుకో వార్త రాస్తనే ఉంది. తాజాగా రెండు దేశాల మధ్య మాటల యుద్ద నడుస్తున్న నేపథ్యంలో రాస్తున్న వార్తా కథనాలు చాలా ఆసక్తి కరంగా ఉన్నాయి. చైనా అధికారిక వార్త సంస్థ గ్లోబల్ టైమ్స్,  మెట్రోషాంగై, మెట్రో బెజ్జింగ్ పత్రికల్లో ఇండియాకు సంబంధించిన  ఆసక్తికరమైన విషయాలు రాశారు.

రెండు దేశాల మధ్య యుద్దం జరుగుతుందా అనే  లెవల్లో అటు ఇటు వాతావరణం ఉంది. అందుకే ఇండియాలో పెట్టుబడులు  తగ్గించుకోవాలని అక్కడి ప్రభుత్వానికి,  పెట్టుబడులు పెట్టే వారికి అక్కడి మీడియా సూచన  చేసింది. ఏ చిన్న అంశమైనా అక్కడ జాతీయ భావంతో ముడివేస్తారని రాస్తున్నది అక్కడి మీడియా.

ఇండియాలో చిన్నచిన్న విషయాలుకూడా జాతీయ బావాలు రగిలిస్తాయని చెప్తూ గతంలో వియత్నాంలో జరిగిన అల్లర్లను ఉదహరిస్తున్నాయి. రిటైల్, కన్జూమర్, ఎలక్ర్టానిక్స్  రంగాల్లో చైనా కంపెనీల ఉత్పత్తులకు భారత్ పెద్ద మార్కెట్. యుద్ద వాతావరణమే ఉంటే వీటిపై తీవ్ర ప్రభావం ఉంటుందని… దీని  దెబ్బకు మన కార్మికుల  ఉపాధి కూడా  దాని ఎఫెక్ట్ ఉంటుందని కూడా అక్కడి మీడయా రాస్తున్నది.

భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు  మంచి అవకాశాలున్నాయి… మార్కెట్  కూడా బాగానే ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త పెట్టుబడులు తగ్గించుకుంటే మంచిదని సూచన చేస్తున్నది. యుద్దం విషయంలో ఎవరి భయాలు వారికున్నాయి.