మోడీని చైనా అంత మాట అన్నదా....... - Telugu News - Mic tv
mictv telugu

మోడీని చైనా అంత మాట అన్నదా…….

July 13, 2017

భారత ప్రధాన  మంత్రి నరేంద్ర మోడీ పెద్ద తోపహే…. ఈ మాట అంటున్నది ఎవరో కాదు… సాక్షాత్తు.. నిన్నటి వరకు మోడీపై బండ రాతలు రాసిన చైనా మీడియా… మోడీ  భజనలో తరిస్తున్నది. జర్మనీలో  ఇండియా, చైనా పెద్ద నాయకులు ఏం సుద్దులు చెప్పుకున్నారో తెలియదు కానీ…చైనా మీడియా మాత్రం మోడీ  గొప్ప నాయకుడని.. పెద్ద  నోట్ల రద్దు నిర్ణయం చాలా మంచిదని  కోడై కూస్తున్నది. రెండు రోజుల కిందటి  వరకు మీకు అస్సలు ఏమీ తెలియదని చెప్పిన అదే మీడియా ఇమ్మిడియేట్ గా టోన్ మార్చింది.   అంతే కాదు జీఎస్టీ వల్ల భారత దేశానికి ఎంత మేలు జరుగుతుందో… ఎట్లా జరుగుతుందో కూడా ఆ మీడియానే చెప్పింది.

ఇప్పటికీ  భారత్, చైనా  మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల బలగాలు అక్కడ మోహరిస్తూనే ఉన్నాయి. ఆ విషయంలో ఏమీ తేలనే లేదు. సడన్ గా మోడీని ఆకాశానికి ఎత్తేయాలని చైనా మీడియా ఎందుకున్నదో మరి. ఏ ప్రయోజనం లేకుండా డ్రాగన్  ఇలాంటి రాతలు రాస్తుందా అనే డౌట్ పడే వాళ్లు  కూడా ఉంటారు. లోపలి గుట్టు మనకైతే తెలియదు. కానీ చైనా మీడియా మాత్రం మోడీ విషయంలో చాలా సాఫ్ట్ కార్నర్ తీసుకున్నది.

మన దేశంపై యుద్దం చేస్తామని బెదిరించింది….  అప్పటి ఇండియా కాదని జైట్లీ అంటే… ఇది కూడా అప్పటి చైనా కాదని చైనా మీడియానే సంపాదకీయాల ద్వారా షాక్ లిచ్చింది. మరిప్పుడు అదే మీడియా టోన్ మార్చి… సెటైర్లు  తీసేసి….. నిఖార్సైన నిజాలు చెప్తున్నట్లు… అబ్బో మోడీ.. ఆహో మోడీ అని అదర గొడుతున్నది. చైనాలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియదు. ఇండియాలో ఏం జరుగుతుందో నిముషాల్లో తెలుస్తుంది.

ఎంత రాసిన కూడా ఎందుకింతగనం మోడీ డబ్బా  కొట్టారనే  సందేహం వస్తూనే ఉంటుంది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో చేపడుతున్న మెట్రో రైల్  కాంట్రాక్టు పనులు చైనా కే ఇచ్చినట్లు వార్తలు  గుప్పు మంటున్నాయి మరి.  అందుకే ఈ రాతలని కొందరు సందేహిస్తున్నారు మరి.