గాల్వన్‌లో ఘటనపై నోరు విప్పిన చైనా.. తప్పుడు లెక్కలేనన్న భారత్ - MicTv.in - Telugu News
mictv telugu

గాల్వన్‌లో ఘటనపై నోరు విప్పిన చైనా.. తప్పుడు లెక్కలేనన్న భారత్

September 26, 2020

hmnghm

భారత్ – చైనా సైనికుల మధ్య గాల్వన్‌ లోయలో జరిగిన వార్‌పై ఎట్టకేలకు డ్రాగన్ దేశం నోరు విప్పింది. ఇప్పటి వరకు తమ సైనికులు మరణంపై నోరు విప్పని ఆ దేశం తాజాగా కొన్ని వివరాలను వెల్లడించింది. తాజాగా రెండు దేశాల మధ్య మాల్డోలో జరిగిన సైనిక చర్చల్లో గాల్వన్ దాడి మృతుల సంఖ్యను బయటకు చెప్పారని తెలుస్తోంది. తమ సైన్యంలో ఐదుగురు చనిపోయారని చైనా అధికారులు పేర్కొన్నారు. అయితే భారత్ మాత్రం వీటిని తప్పుడు లెక్కలుగా చెబుతోంది. దాదాపు మూడింతలు ఎక్కువ మందే మృతులు ఉంటారని అభిప్రాయపడుతోంది. 

ఈ ఏడాది జూన్ 15వ తేదీన భారత, చైనా సైనిక దళాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో భారత్ 20 మంది సైనికులను పోగొట్టుకుంది. ఈ విషయాన్ని వెంటనే ప్రకటించింది. కానీ చైనా మాత్రం లెక్కలు బయటపెట్టలేదు. కానీ ఎక్కువ సంఖ్యలోనే చైనా సైన్యం చనిపోయారని భారత్ చెబుతూ వచ్చింది. కానీ పీఏఎల్‌కు చెందిన ఐదుగురే చనిపోయారని డ్రాగన్ వ్యాఖ్యానిస్తోంది. మొత్తం మీద అటు నుంచి కూడా ప్రాణ నష్టం జరిగిన విషయాన్ని మాత్రం ఎట్టకేలకు అంగీకరించాల్సి వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.