ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఊహించలేం. రాసిపెట్టి ఉంటే యముడుని ఆపలేరంటారు. ఈ చావు ను చూస్తే అలాగే అనిపిస్తోంది. ఎంతో జాగ్రత్తగా వెళ్తోన్న మినీ బస్సుపైకి క్రేన్ మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. కన్ స్ట్రక్షన్ క్రేన్ ముందుభాగం రోడ్డు మీద వెళ్తున్న ఓ మినీ వ్యాన్ పై పడటంతో బస్సులోని ఏడుగురు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. చైనాలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ రోడ్డు పక్కనే ఓ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ జరుగుతుంది. కన్ స్ట్రక్షన్ కోసం ఉపయోగించే క్రేన్ ముందుభాగం అదుపు తప్పి రోడ్డు మీద వెళ్తున్న ఓ మినీ బస్సు మీద పడటంతో ఆ బస్సు రోడ్డుకు అతుక్కుపోయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.
https://www.youtube.com/watch?v=93tHRPqBsUA