భారీ స్థాయిలో చైనా రక్షణ బడ్జెట్... ఎంతంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

భారీ స్థాయిలో చైనా రక్షణ బడ్జెట్… ఎంతంటే..

March 5, 2022

15

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన చైనా, రక్షణ బడ్జెట్‌ను కూడా ఆ స్థాయిలోనే పెంచేసింది. శనివారం జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశంలో వార్షిక రక్షణ బడ్జెట్ వ్యయాన్ని 230 బిలియన్ డాలర్లు (దాదాపు 17.50లక్షల కోట్లు)గా ప్రతిపాదించారు. అంటే భారత రక్షణ బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ. ఈ జాబితాలో 600 బిలియన్ డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. సరిహద్దు దేశాలతో వివాదాలు, ఇండో – పసిఫిక్ జలాల్లో ఆధిపత్యం కోసం ఆరాటం నేపథ్యంలో రక్షణ రంగానికి భారీ కేటాయింపులు చేస్తున్నామని లీ కెకియాంగ్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా, జీ జిన్‌పింగ్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత రక్షణ బడ్జెట్ భారీగా పెరుగుతూ వస్తోంది. పదాతి దళాల సంఖ్యను తగ్గించినప్పటికీ, నౌకా దళాలకు, వాయు సేనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మరోవైపు చైనా అంతర్గత భద్రతకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తుంది. అందుకు గాను రక్షణ రంగ బడ్జెట్ కంటే ఎక్కువ నిధులను కేటాయిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన మిలటరీ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం అన్ని విషయాల్లో గతం కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ.. చైనాను ఢీకొట్టే పరిస్థతి వస్తే మరింత ఆధునిక సాంకేతికత, కొత్త ఆయుధాలు, డ్రోన్ టెక్నాలజీ వంటి అంశాలపై పరిశోధనల వేగం పెంచాలని వారు సూచిస్తున్నారు.