తెరుచుకున్న 500 థియేటర్లు.. ఎంతమంది వచ్చారంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

తెరుచుకున్న 500 థియేటర్లు.. ఎంతమంది వచ్చారంటే..

March 24, 2020

Theaters

చైనా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా, వినాశనం సృష్టించిన కరోనా వైరస్ ఇప్పుడు  శాంతించింది. ఇప్పుడిప్పుడే అక్కడ జనాలు కుదుటపడుతున్నారు. ఇన్నిరోజులు భయం గుప్పిటలో బిక్కుబిక్కుమంటూ బతికిన జనాలు ఎంటర్‌టైన్‌మెంట్ ఊసే మరిచిపోయారు. ఇప్పుడు వారికి ఊరట కల్పించడానికి మూతపడ్డ 500కి పైగా సినిమా థియేటర్లు తిరిగి తెరిచారు. ప్రస్తుతం 507 సినిమా థియేటర్లు తెరిచి ఉన్నాయని.. అయినప్పటికీ వైరస్ వ్యాప్తికి ముందు పనిచేసిన అన్ని సినిమాల్లో 5% కన్నా తక్కువ సంఖ్యను సూచిస్తుందని ఆర్థిక ప్రచురణ కైక్సిన్ వెల్లడించింది. చాలా రోజుల తర్వాత తెరుచుకున్న సినిమా థియేటర్లు కిక్కిరిసిపోతాయని థియేటర్ యజమానులు భావించారట. కానీ, అనూహ్యంగా ఒక్క ఈగ కూడా అటు వైపు వెళ్లడంలేదట. 

ఏమో మళ్లీ కరోనా సోకుతుందనే భయంతో బహిరంగ ప్రదేశాలకు కూడా రావడానికి జంకుతున్నారని వెరైటీ రిపోర్ట్ పేర్కొంది. దేశ వ్యాప్తంగా టికెట్ అమ్మకాలు మొత్తం $ 2,000 (సుమారు 7 1,700) కంటే తక్కువగా ఉన్నాయని. హాంకాంగ్ సరిహద్దులోని తీర ప్రాంతమైన ఫుజియాన్, గ్వాంగ్డాంగ్లలో ఒక్క టికెట్ కూడా అమ్మలేదు. కాగా, యూకేలో ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు స్వచ్ఛంద గృహ నిర్బంధం అమలు చేసే ప్రయత్నంలో భాగంగా సినిమా థియేటర్లు అన్నీ మూసివేశారు. ఈ క్రమంలో జేమ్స్‌బాండ్ చిత్రం ‘నో టైమ్ టు డై’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ తో సహా ఇతర సినిమాలు వాయిదా పడ్డాయి.