గాంధీలో చైనా సీన్.. బెడ్లు లేక ఎక్కడున్నారో చూడండి.. - MicTv.in - Telugu News
mictv telugu

గాంధీలో చైనా సీన్.. బెడ్లు లేక ఎక్కడున్నారో చూడండి..

July 4, 2020

Gandhi Hospital.

రోజురోజుకు దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంటే. ఆసుపత్రుల్లో పేషెంట్ల పరిస్థితి మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పైకి ప్రభుత్వం కరోనా పేషెంట్లను కడుపులో పెట్టి చూసుకుంటున్నాం అని ఎంత చెబుతున్నా రియాలిటీకి వచ్చేసరికి ఆసుపత్రుల్లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంటోంది. ఆసుపత్రుల్లో పేషెంట్లను వైద్యులు పట్టించుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో బాధితులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితిని తెలియజేస్తోంది ఓ వీడియో. కోవిడ్‌ వార్డుల్లో అటెండర్లు లేక కరోనా పేషెంట్లు లిఫ్ట్ దగ్గర నేలమీద పడిఉన్నారు. శ్వాస తీసుకోవడానికి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇద్దరికీ పీపీఈ కిట్లు తొడిగి ఉన్నాయి.  వారికి కనీసం సాయం చేసేవారు లేక ఇద్దరు రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిని చూస్తుంటే చైనాలో ఎదురైన సీనే ఇక్కడ పునరావృతం అవుతుందేమో అనిపిస్తోంది.   60 మంది కరోనా పేషెంట్లకు కేవలం నలుగురు మాత్రమే వార్డు బాయ్స్‌ ఉన్నారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో గాంధీ ఆసుపత్రి నిండిపోతోంది. దీంతో కరోనా పేషెంట్లకు బెడ్లు కరువు అవుతున్నాయి. ఇదిలావుండగా మరో ఘటనలో కరోనా మహమ్మారి బంధుత్వాలను, మానవతా విలువలను మంటగలిపింది.  

టోలిచౌకి పారామౌంట్‌ కాలనీలోని ఓ భవనంలో మొదటి అంతస్తులో హారూన్‌ షా అద్దెకు నివాసం ఉంటున్నాడు. గత నెల 30న అతను భోజనం చేస్తుండగా ఒకేసారి కుప్పకూలిపోయి కిందబడటంతో పెద్ద శబ్దం వచ్చింది. ఆ చప్పుడు విని పక్క ఫ్లాట్‌ వాళ్లు వచ్చి చూసి వెళ్లిపోయారు. మరుసటి రోజు హారూన్‌ షా మృతి చెందాడని తెలియడంతో కరోనా వల్లే మృతి చెందాడని స్థానికంగా పుకార్లు లేచాయి. దీంతో హారూన్‌ ఇరుగుపొరుగు వారు తమ ఫ్లాట్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసులు మృతదేహాన్ని చూసి వెళ్లిపోయారే తప్పా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయం తెలిసి మృతుడి దూరపు బంధువైన ముజాహెద్‌ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. స్థానికులెవరూ అంత్యక్రియలకు సహకరించకపోవడంతో ముజాహెద్‌ సఖీనా ఫౌండేషన్‌ వారిని సంప్రదించాడు. వారి సహకారంతో హారూన్ షా అంత్యక్రియలు నిర్వహించాడు. కాగా, గతంలో అనాథలు, కోవిడ్‌–19తో మృతిచెందిన వారికి సఖినా ఫౌండేషన్‌ అంత్యక్రియలు నిర్వహించింది. 

Publiée par Satyavathi Satya sur Samedi 4 juillet 2020