ఇది పేరెంట్స్ కు తెగ మెచ్చే శిక్ష... - MicTv.in - Telugu News
mictv telugu

ఇది పేరెంట్స్ కు తెగ మెచ్చే శిక్ష…

June 27, 2017

స్కూల్లో పిల్లల్ని పల్లెత్తు మాట అన్న కొందరు పేరెంట్స్ తట్టుకోలేరు. పొరపొటున టీచర్ కొడితే..రచ్చ రచ్చే. కానీ ఆ విద్యార్థులకు విధించిన ఆ శిక్షను చూసి పేరెంట్స్ మెచ్చుకుంటున్నారు. టీచర్లు చేసిన పనిని తెగ పొగడుతున్నారు. ఇంతకీ వారికి విధించిన శిక్ష ఏంటీ అంటే…

ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్స్ యుగం.అవి కనిపించాయంటే చార్జింగ్ అయిపోయేదాకా పిల్లలు వదలరు. ఇంటిలో గోల భరించలేక పేరెంట్స్ ఇస్తారు. మరి స్కూల్ కు తీసుకెళ్తామంటే ..అస్సలు ఒప్పుకోరు. కొందరు పిల్లలు వారి కంటపడకుండా స్కూళ్లకు తీసుకెళ్తారు. ఇలా తెచ్చిన ఫోన్ల బాధ భరించలేని చైనాలోని ఓ స్కూల్ విద్యార్థుల్ని కొట్టక, తిట్టక మరో కఠిన శిక్ష విధించింది. క్లాస్‌రూంలో విద్యార్థులు విచ్చలవిడిగా వాడుతున్న ఫోన్లు లాక్కున్నారు. విద్యార్థులందరినీ గ్రౌండ్ లో కూర్చోపెట్టి వారి కళ్లముందే ఒక్కో ఫోనుని పగులగొట్టారు. దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పూర్తిగా సహకరించారు. తాము చేయలేనిది టీచర్లు చేస్తున్నందుకు ఖుషీ అయ్యారు. కొసమెరుపు ఏంటంటే ఫోన్లు పగులగొడుతుంటే స్టూడెంట్స్ తెగ బాధపడిపోయారు. ఎంతలా అంటే చెప్పడం ఎందుకు మీరే చూసేయండి.