పాక్‌కు చైనా మస్కా.. N95 మాస్కులంటూ పాత అండర్‌వేర్లు - MicTv.in - Telugu News
mictv telugu

పాక్‌కు చైనా మస్కా.. N95 మాస్కులంటూ పాత అండర్‌వేర్లు

April 4, 2020

China sends N-95 masks made of ‘underwear’ to Pakistan ; video goes viral

పాకిస్తాన్, చైనాల మధ్య మాంచి దోస్తానీ ఉంది. పాక్ తుమ్మితే చైనా కర్చీఫు అడ్డం పెట్టే రకం. దక్షిణాసియాలో ప్రాంతీయ అధిపత్యం కోసం చైనా పాకిస్తాన్‌కు తరచూ డబ్బు సాయం కూడా చేస్తుంటుంది. రెండూ కలసి సరిహద్దులో భారత్‌ వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేపడుతుంటాయి. ఇవన్నీ పాత సంగతులే కదా. అయితే కరోనా వ్యవహారంలో పాక్‌కు చైనా మాంచి మస్కా కొట్టింది. ‘ఇంద మా సాయం ఇదీ.. బాగా వాడుకోండి.. ’ అంటూ నీచనికృష్టకంపు సాయం చేసింది!

కరోనా నివారణ చర్యల్లో భాగంగా పాక్‌కు భారీ సంఖ్యలో ఎన్95 మాస్కులను పంపిస్తామన్న చైనా వాటికి బదులుగా పనికిమాలిన మాస్కులను పంపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వీడియోలు కూడా వైరల్ అవుగున్నాయి. పాక్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. చైనా నుంచి మాంచి నాణ్యమైన  మాస్కులను వస్తాయని ఆశగా ఎదురు చూసిన సింధ్ రాష్ట్ర అధికారులు తమ చేతికందిన వాటిని చూసి మూర్ఛపోయారు. వాడిపడేసిన లోదుస్తులు, పాతగుడ్డలతో ఆ మాస్కులను తయారు చేశారు. ‘చైనా మా ముఖానికి సున్నం పూసింది..’ అని వాపోయారు. దీన్ని జీర్ణించుకోక మాస్కులను తిరిగి వెనక్కి వెనక్కి పంపించారు.