చైనా కంపెనీకి ఈడీ గట్టి షాక్.. రూ.5,551 కోట్లు స్వాధీనం - MicTv.in - Telugu News
mictv telugu

చైనా కంపెనీకి ఈడీ గట్టి షాక్.. రూ.5,551 కోట్లు స్వాధీనం

April 30, 2022

భారతదేశ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చైనా దేశానికి చెందిన షావోమీ మొబైల్ కంపెనీకి గట్టి షాక్ ఇచ్చారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించకుండా ఇష్టమొచ్చినట్లు కార్యకలపాలు నిర్వహిస్తుడడంతో, ఉల్లంఘనల కింద షావోమీ మొబైల్ టెక్నాలజీ ఖాతా నుంచి రూ.5551.27 కోట్ల డిపాజిట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..”ఈ కంపెనీ గత కొన్నేళ్లుగా రూ.5551,27 కోట్ల విదేశి నిధులను మూడు సంస్థలకు అక్రమంగా పంపించింది. షావోమి గ్రూప్‌తో పాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు చేరినట్లు ఆధారాలు ఉన్నాయి. రాయల్టీల రూపంలోనే ఈ భారీ మొత్తాన్ని బదిలీ చేసింది. ఇలా పంపించటం ఫెమా చట్ట నిబంధనలకు విరుద్ధం. అంతేగాక, బ్యాంకులను తప్పుదోవ పట్టించి, ఈ నిధులను విదేశాలకు చేరవేసింది” అని ఈడీ అధికారులు వెల్లడించారు.

మరోపక్క షావోమీ కంపెనీ 2014 నుంచి భారతదేశంలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 2015 నుంచి చెల్లింపులు చేస్తోంది. ఎంఐ బ్రాండ్ ఉత్పత్తులకు షావోమీ భారత్‌లో ట్రేడర్, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ తయారు చేసిన వివిధ మొబైల్స్‌ను ఎంఐ బ్రాండ్ కింద విక్రయిస్తుంది. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న మూడు సంస్థలకు ఎలాంటి సేవలను పొందకుండానే, మూడు సంస్థలకు రూ. 5551,27కోట్లను అక్రమంగా పంపించడంతో ఈడీ అధికారులు అప్రమత్తమై, దర్యాప్తు చేపట్టారు.