కవ్విస్తున్న చైనా.. మళ్లీ గీత దాటింది - MicTv.in - Telugu News
mictv telugu

కవ్విస్తున్న చైనా.. మళ్లీ గీత దాటింది

June 30, 2020

b gcbn

డ్రాగన్ కంట్రీ ఇంకా తన కంత్రీ బుద్ధిని మార్చుకోవడం లేదు. సరిహద్దుల్లో ప్రతిసారి కవ్విస్తూనే ఉంది. తాజాగా మరోసారి సరిహద్దు గీతను దాటి భారత భూ భాగంలోకి అక్కడి సైన్యం చొచ్చుకు వచ్చింది. దాదాపు 423 మీటర్ల మేర ముందుకు వచ్చినట్టుగా ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై భారత్ సీరియస్‌గా ఉంది. భారత్-చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్న సమయంలో కూడా ఇలాంటి ఘటనలపై పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. 

1960లో చైనా పేర్కొన్న సరిహద్దులను కూడా దాటి రావడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చైనా కావాలనే కయ్యానికి కాలు దువ్వుతోందని అంటున్నారు. గల్వాన్ ఘటన తర్వాత కూడా మొండిగా వ్యవహరించడం ఏందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి సైనికులు ఉండరాదన్న ఒప్పందానికి చైనా తూట్లు పొడవటమే కాకుండా.. భారత భూ భాగంలోకి అక్రమంగా రావడం విశేషం. కాగా ఇప్పటికే చైనా తీరును ఎండగడుతూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు టిక్ టాక్ సహా 59 యాప్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.