ఆశ్ఛర్యం.. తొలిసారి భారత్‌కు అండగా నిలిచిన చైనా - MicTv.in - Telugu News
mictv telugu

ఆశ్ఛర్యం.. తొలిసారి భారత్‌కు అండగా నిలిచిన చైనా

May 16, 2022

ఆసియాపై తన ఆధిపత్యానికి ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మన దేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా దేశం తొలిసారి మనకు మద్ధతుగా నిలిచింది. వివరాలు.. ధరలను స్థిరీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం గోధుమల ఎగుమతిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే భారత్ తీసుకున్న నిర్ణయాన్ని జీ7 దేశాలు వ్యతిరేకించాయి.

దీంతో ఈ విషయంతో చైనా మనకు మద్ధతుగా మాట్లాడుతూ.. ఆయా దేశాలను విమర్శించింది. ‘గోధుమ ఎగుమతులపై భారత్ నిషేధం విధించకూడదని అంటున్నారు. మరి ఆ దేశాలు ఎందుకు తమ ఎగుమతులను పెంచట్లేదు. గోధుమల ఉత్పత్తిలో భారత్ రెండో అతిపెద్ద ఉత్పత్తిదారు. అయినా ఎగుమతుల్లో భారత్ వాటా చాలా తక్కువ. ఆహార భద్రత దృష్ట్యా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు ఆయా దేశాలకు లేదు. భారత్‌ను నిందించినంత మాత్రాన ప్రపంచ ఆహార సంక్షోభానికి పరిష్కారం దొరకదు’ అని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.