2013లో చనిపోయిన జంటకు 2017లో బిడ్డ పుట్టాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

2013లో చనిపోయిన జంటకు 2017లో బిడ్డ పుట్టాడు..

April 12, 2018

చైనాలో ఒక అద్భుతం జరిగింది. కడుపుకోతతో తల్లడిల్లుతున్న రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ పుణ్యామా అని నాలుగేళ్ల కింద చనిపోయిన దంపతులు ఇప్పుడు పండంటి కొడుకు జన్మనిచ్చారు..!

షెన్ జీ, లియూ జీ భార్యాభర్తలు. వారికి పెళ్లయిన రెండేళ్లయినా పిల్లలు కలగలేదు. దీంతో కృత్రిమ గర్భధారణ విధానంలో సంతానం కనాలనుకున్నారు. అందరు అన్నీ సిద్ధమయ్యాయి. అయితే దురదృష్టం కారు ప్రమాద రూపంలో ఎదురైంది. ఫలదీకరణ చెందిన పిండాలను లియూ గర్భంలో మరో ఐదు రోజుల్లో ప్రవేశపెడతారనగా కారు ప్రమాదం జరిగింది. భార్యాభర్తలిద్దరూ చనిపోయారు 2103లో ఈ విషాదం జరిగింది. అయితే మృతుల తల్లిదండ్రులకు తమ బిడ్డల ప్రతిరూపాలను చూడాలని తపన. మృతులు వారి తల్లిదండ్రులకే ఏకైక సంతానాలు.

భద్రపరిచిన పిండాల ద్వారా సరోగసీ విధానంలో వంశాంకురం కోసం యత్నించారు మృతుల తల్లిదండ్రులు. అయితే ఆస్పత్రి అందుకు ఒప్పుకోలేదు. సదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఆ అండాలు దక్కాయి. అయితే చైనాలో అద్దెగర్భాల ద్వారా పిల్లలను కనడం నేరం. దీంతో లావోస్‌కు చెందిన ఓ మహిళను ఆశ్రయించారు. అనేక న్యాయమైన చిక్కుల తర్వాత ఒప్పందం కుదిరింది. ఆమెను టూరిస్ట్ వీసా కింత చైనాకు తీసుకొచ్చారు. గత ఏడాది.. 2017 డిసెంబర్ 1న బిడ్డ పుట్టాడు. నానమ్మ, తాతయ్యలు వాడికి ‘టయాంటిన్‌’ అని పేరు పెట్టారు.