చైనా సంచలనం.. కృత్రిమ సూర్యుడు వచ్చేశాడు! - MicTv.in - Telugu News
mictv telugu

చైనా సంచలనం.. కృత్రిమ సూర్యుడు వచ్చేశాడు!

December 8, 2020

bbgb

మన ప్రపంచానికి ఒక్కడే సూర్యుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ నిజం కాలగర్భంలో కలిసిపోయింది. చైనా సూర్యుడికి ప్రతిసృష్టి చేసి కొత్త సూర్యుడిని తయారు చేసింది. చైనానే కాదు, మరికొన్ని దేశాలు కూడా కొత్త సూర్యుళ్లను తయారు చేయడంలో బిజీగా ఉన్నాయి. దీంతో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్న మాటకు కాలం చెల్లిపోయినట్టే!

దేశీయంగా రూపొందించిన టెక్నాలజీ ఆర్టిఫిషియల్‌ సన్‌ను తయారు చేసినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది.  ఈ కొత్త భానుడి పేరు హెచ్‌ఎల్‌-2ఎమ్‌ టోకామాక్ రియాక్టర్. అణుశక్తి కోసం దీన్ని తయారు చేశారు. చైనాలో అతి పెద్ద, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగం కోసం ఈ కృత్రిమ సూర్యుడు అవసరమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో అగ్రభాగంలో ఉన్న జపాన్, జర్మనీ, అమెరికా, రష్యాలకు కూడా సాధ్యం కాని పని చైనా చేసి చూపడం గమనార్హం. 

డ్రాగన్ దేశం తయారు చేసిన కృత్రిమ సూర్యుడిలో శక్తిమంతమైన ఆయస్కాంత క్షేత్రం ఉంది. దీనిలో మెటల్ ప్లాస్మాను  విచ్చిన్నం చేస్తారు. ఫలితంగా 15 కోట్ల డిగ్రీల సెల్సియస్ శక్తి విడుదల అవుతుంది. ఈ వేడి నింగిలోని అసలు సూర్యుడి మధ్యభాగంలో వెలవడే వేడి కంటే 10 రెట్లు ఎక్కువ. అందుకే దీన్ని కృత్రిమ సూర్యుడిగా వ్యవహరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

అసలు సూర్యుడిలోనూ అణువుల విచ్ఛిన్నం వల్లే శక్తి ఏర్పడుతుంది. విచ్ఛిన్నం వల్లే కాంతి ఏర్పడి భూమికి చేరుతుంది. భూమిపై ప్రాణులకు సూర్యుకాంతే ఆధారమన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సూత్రాన్ని అనుసరించి చైనా ప్రభుత్వం నకిలీ సూర్యుడికి పురుడు పోసింది. దీన్ని సిచువాన్ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. కొత్తరకం న్యూక్లియర్ ఫ్యాజన్‌ను తయారు చేస్తున్నట్లు చైనా 2006లోనే  ప్రకటించింది. అయితే అది కాస్తా కృత్రిమ సూర్యుడిగా మారడం ఆసక్తి కలిగిస్తోంది. కృత్రిమ సూర్యుడి ద్వారా వెలువడే అణుశక్తిని చైనా విద్యుత్ కోసం కాకుండా అణ్వాయుధాల కోసం వాడితే భారతదేశానికి కొత్త ముప్పు పొంచి ఉన్నట్లే. ఫ్రాన్స్ కూడా భారీ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ తయారు చేయడం చూస్తుంటే అగ్రదేశాలు ఇంధనం, అణ్వాయుధాల కోసం ఆర్టిఫిషియల్ సూర్యుళ్ల బాట పట్టాయని అర్థం చేసుకోవచ్చు.