China to start space tourism
mictv telugu

అంతరిక్ష పర్యాటకంలోకి చైనా.. ఒక్క టిక్కెట్ ధర రూ. 2.20 కోట్లు

September 19, 2022

పరిశోధనలకే పరిమితమైన అంతరిక్షం ఇప్పుడు పర్యాటకంగా కాసులు కురిపించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, రష్యాలు ఇప్పటికే ఈ అంశంలో ముందుండగా.. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా స్పేస్ టూరిజంను అభివృద్ధి చేశాయి. ఇందులో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్, సర్ రిచర్డ్ బ్రాన్సన్‌కు చెందిన వర్జిన్ గెలాక్టిక్, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థులు పర్యాటకులను భూమి నుంచి రోదసిలోకి 100 కిలోమీటర్ల వరకు తీసుకెళుతుంది. అంతరిక్ష సరిహద్దుగా భావించే కార్మెల్ లైన్ వరకు పర్యాటకులను తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి చైనా వచ్చి చేరింది. 2025 నాటికి పర్యాటకులతో రోదసి యాత్రలు చేయాలని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రణాళికలు రూపొందించిది. ఈ యాత్ర కోసం ఒక్కో ప్రయాణీకుడి నుంచి రూ. 2.20 నుంచి 3.43 కోట్ల వరకు వసూలు చేయనుంది. మన దేశంలో కూడా భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకులు పెరిగే ఛాన్సుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆ దిశగా తన ప్రయత్నాలను కూడా మొదలుపెట్టింది.