దేశంలో జరిగే మావోయిస్టు విధ్వంసాల వెనుక చైనా హస్తం ఉందా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. బీహార్లో ఇటీవల ఓ మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు. అతని సమాచారం ప్రకారం గత మూడు రోజులుగా సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ దళాలు ఆపరేషన్ నిర్వహించగా, పెద్ద ఎత్తున ఆయుధాలు లభ్యమయ్యాయి. అందులో చైనా తయారీ ఏకే 56, ఏకే4 రైఫిల్స్, దేశీ తయారీ రైఫిల్స్, గ్రనేడ్లు ఉన్నాయి. దీంతో ఆ దిశగా నిఘా వర్గాలు సమాచార సేకరణలో పడ్డాయి. మరోవైపు మావోయిస్టుల వెనుక చైనా ప్రభుత్వ హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారిస్తున్నారు.