పువ్వు కోసం పోలీసులను ఆశ్రయించారు... - MicTv.in - Telugu News
mictv telugu

పువ్వు కోసం పోలీసులను ఆశ్రయించారు…

July 27, 2017

పూల దుకాణంలో ఓ పువ్వుని ఎవరో ఎత్తుకెళ్లారు. ఆ షాపు ఓనర్ చాలా కంగారుపడిపోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.పోలీసులు సిసిటీవి పుటేజ్ చూసి ఆ వ్యక్తిని కనుగొన్నారు. ఆ వ్యక్తి ఇంటికి పొయి మరీ ఆ పువ్వును స్వాధీనం చేసుకున్నారు. పూల దుకాణంలో చాలా పూలు ఉంటాయి.ఒక పువ్వు ఎత్తుకుపోతే ఏం అయింది అనుకుంటున్నారా.!అది అలాంటి ఇలాంటి పువ్వు కాదు చెబితే మీరే అశ్చర్యపొతారు.!

చైనాలోని ఓ తైవానీన్ షాపులో ఓ మహిళ ఒక పువ్వును కొన్నది. అయితే ఆ పువ్వు మంచిగలేదట. అయితే దాని పక్కన ఉన్న ఐరీస్ జపొనికా( బటర్ ప్లై ప్లవర్) నుఆ షాపు ఓనర్ కు చెప్పకుండానే పట్టుకపొయింది. అయితే కాసేపు తరువాత ఆ దుకాణం ఓనర్ ఐరీస్ జపొనికా పువ్వు కోసం వెతికాడు. కాని ఎంత వెతికినా దొరకలేదు. అది చాలా అరుదైన ప్లవర్ ,ఎనిమిది సంవత్సరాలు కష్టపడితే ఆ పువ్వు పూస్తంది.దాని విలువ దాదాపు 20 కోట్లు. ఆ ప్లవర్ ను ఉపయోగించి అలాంటి చెట్ల ను పెంచి తరువాత తన వ్యాపారం అభివృద్ది చేసుకోవాలని అనుకున్నాడు . అంతేకాక ఈ ప్లవర్స్ కోసం వేరే సంస్థల నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయట. కాని వారి వద్ద ఉన్న ఒకే ఒక పువ్వు ను ఆ మహిళ తీసుకుపోయింది. దీంతో ఆ దుకాణం ఓనర్ పొలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించిన తరువాత ఆ మహిళ కారు నెంబరు ఆధారంగా చిరునామా కనుక్కొని ఇంటికి వెళ్లి ఆ పువ్వును దుకాణం ఓనర్
కు అప్పగించారు. ఆ మహిళ ప్లవర్ ను తిరిగి ఓనర్ కు ఇవ్వడంతో ఆయన కేసు పెట్టలేదు.