ఏపీ రోడ్లపై చినజీయర్ స్వామి కామెంట్స్.. ట్వీట్ చేసిన నారా లోకేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ రోడ్లపై చినజీయర్ స్వామి కామెంట్స్.. ట్వీట్ చేసిన నారా లోకేశ్

May 19, 2022

రాజకీయాలకు దూరంగా ఉండే ఆధ్మాత్యిక గురువు చినజీయర్ స్వామి… తాజాగా ఏపీ రోడ్ల దుస్థితి గురించి వ్యంగంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలోని జంగారెడ్డి గూడెం నుంచి ఏపీలోని రాజమండ్రికి వెళ్లడానికి 3 గంటలు పట్టిందని ఆయన తెలిపారు. ‘ప్రయాణం చేసే సమయంలో ఒడిదొడుకులు ఉండొచ్చు.. ఒక్కోసారి గోతులు కూడా ఉండొచ్చు.. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి రావడానికి.. చాలా బాగుంది.. చక్కగా జ్ఞాపకం ఉండేలా ఉంది’ అంటూ భక్తులతో మాట్లాడే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

స్వామీజీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ‘‘రాష్ట్రంలో రోడ్లు న‌డిచేందుకు కూడా వీలుగా లేవ‌ని జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారు. ప‌క్క రాష్ట్ర పాల‌కులు అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా మ‌న ఏపీని చూపిస్తున్నారు. అయినా ప్రభుత్వ స్పంద‌న శూన్యం. రాజ‌కీయాల‌కు దూరంగా, ఆధ్మాత్మిక ప్రపంచానికి ద‌గ్గర‌గా హిందూ ధ‌ర్మ ప్రచార‌మే జీవిత‌ ల‌క్ష్యంగా సాగుతోన్న చిన‌ జీయ‌ర్ స్వామి ఆంధ్రప్రదేశ్లో ర‌హ‌దారుల దుస్థితిపై ఆవేద‌న‌తో స్పందించారు. గ‌తుకులు-గుంత‌లు, ఒడిదుడుకుల గురించి ప్రస్తావిస్తూనే జంగారెడ్డి గూడెం నుంచి రాజ‌మ‌హేంద్రవ‌రం వ‌ర‌కూ రోడ్డు ప్రయాణం ఒక జ్ఞాప‌కంగా మిగిలిపోనుంద‌ని రోడ్ల దుస్థితిని భ‌క్తుల‌కు చెబుతున్నట్టే ప్రవ‌చ‌నంలో భాగంగానే వ్యాఖ్యానించ‌డం చూస్తుంటే.. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో ర‌హ‌దారులు ఎంత దారుణంగా వున్నాయో స్పష్టం అవుతోంద’ని లోకేశ్ ట్వీట్ చేశారు.