ఊరు కాదు, డైనోసార్ల ఫామ్.. 18 వేల గుడ్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఊరు కాదు, డైనోసార్ల ఫామ్.. 18 వేల గుడ్లు

September 18, 2020

China's Guangdong dinosaur eggs in the world fossils in Heyuan

ఎక్కడ పడితే అక్కడ డైనోసార్ల ఎముకలు.. కొంచెం లోతుగా తవ్వితే చాలు వాటి గుడ్లే గుడ్లు. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా 18వేల రాకాసి బల్లులు గుడ్లు! కోళ్ల ఫారమ్‌లో వందలు, వేల గుడ్లు ఉత్పత్తి అయినట్లు ఆ ప్రాంతలో డైనోసార్ గుడ్లు బయటపడుతున్నాయి. వేల ఏళ్ల కిందట అక్కడ ఏకంగా డైనోసార్ల ఫారమే నడిచింది. తాజా తవ్వకాల్లో 90 లక్షల ఏళ్ల నాటి గుడ్లు కూడా చెక్కుచెదరకుండా దొరికాయి. డ్రాగన్‌ దేశం చైనాలోని గువాంగ్‌డాంగ్ రాష్ట్రంలోని హేయువాన్ ప్రాంతంలో ఈ తవ్వకాలు సాగుతున్నాయి. 

ప్రపంచంలో అత్యధికంగా రాకాసిబల్లుల గుడ్లు దొరికిన ప్రాంతంగా హేయువాన్ రికార్డులకెక్కింది. తాజా తవ్వకాల్లో 33 గుడ్లు అప్పుడే పెట్టినంత భద్రంగా కనిపించాయి. మట్టిలో కూరుకుపోవడంతో ఇవి పగిలిపోకుండా శిలాజాలుగా మారినట్లు జీవశాస్త్రవేత్తలు తెలిపారు. గత ఏడాది ఓ స్కూలు విద్యార్థి ఏకంగా 10 డైనోసార్ల గుడ్లను ఇదే ప్రాంతంలో వెలికి తీశాడు. ‘ఇది జారాసిక్ పార్క్‌ను తలపించే ప్రాంతం. ఇక్కడ ఆ కాలంలో అన్నేసి బల్లులు తిరిగాయంటే మాకు నమ్మకం కలగదు. కానీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న శిలాజాలను చూస్తుంటే నమ్మక తప్పదు కదా.. ’ అని స్థానికులు చెబుతున్నారు.