కరోనా వైరస్‌ను ప్రపంచానికి అంటగట్టిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాలో రాజకీయ సంక్షోభం కూడా మొదలైంది. దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు కమ్యూనిస్టు పార్టీ ఉద్వాసన పలకనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. కరోనా కట్టడి విఫలం వంటి కారణాలతో ఆయనను పదవి నుంచి దిగిపోవాలని కామ్రేడ్లు ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సీపీసీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం ఇటీవల ముగిసిన నేపథ్యంలో ఈ ప్రచారం జోరందుకుంది. జిన్‌పింగ్‌ను తప్పించి ప్రస్తుత ప్రధాని లీ కెకియాంగ్ను అధ్యక్షుణ్ని చేస్తారంటూ కమ్యూనిస్టు పార్టీ నేత ఒకరు చెప్పినట్లు కెనాడకు చెందిన ప్రవాస బ్లాగర్ యూట్యూబ్‌లో ఉంచిన వీడియోలో చెప్పారు. ఇది వైరల్ కావడంతో చైనా సెన్సార్ చేసింది. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతున్నట్లు ఆ బ్లాగర్ తెలిపారు. కరోనా పేషంట్లను బలవంతంగా ఆస్పత్రులకు తరలించడంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం వంటి కారణాలతో జిన్‌పింగ్ ప్రతిష్ట మసకబారింది.