కరోనా ఎఫెక్ట్.. చైనాలో కొత్త నోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఎఫెక్ట్.. చైనాలో కొత్త నోట్లు

February 17, 2020

Coronavirus

మహమ్మారి కరోనా వైరస్‌తో చైనా అల్లకల్లోలంగా మారిపోయింది. అక్కడి ప్రజలు క్షణక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగానూ ఈ వైరస్ భయం పట్టుకుంది. ఇప్పటికి ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 69 వేలకు చేరుకుంది. వెయ్యి పైచిలుకు మంది మృత్యువాత పడ్డారు. దీంతో వైరస్ మరింత ప్రబలకుండా చైనా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా నగదుతో వైరస్ సోకే అవకాశం ఉన్నందున.. కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయించింది. 85.6 బిలియన్ల డాలర్ల యువాన్లను ముద్రిస్తున్నామని చైనా సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఫాన్ యెఫెయ్ పేర్కొన్నారు. 

వుహాన్ సహా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్పత్రులు, మార్కెట్లు, బస్సులలో నగదు బదిలీలు ఉండవని.. తిరిగి ప్రజలకు డబ్బులు ఇవ్వబోమని అధికారులు స్పష్టంచేశారు. ఆయా చోట్ల నగదును తీసుకుని తిరిగి ప్రజల్లోకి పంపించబోమని వెల్లడించారు. కొత్త నోట్లను చెలామణి చేస్తూ.. పాత నోట్లను 14 రోజుల వరకు ఇతర చోట నిల్వ చేస్తామని తెలిపారు. లేదంటే అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో నిల్వ చేసి.. వైరస్ జాడ లేదని నిర్ధారించుకున్న తర్వాతే తిరిగి చెలామణి చేస్తామని వివరించారు. వైరస్ లక్షణాలు ఉంటే పంపించమని అన్నారు.