మాంచి లాభాల్లో ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్లు ఇవ్వడం మామూలే. సింగరేణి గనులు, ఇండియన్ రైల్వే వంటివి పండగలకు భారీగా బోనస్ ఇస్తుంటాయి. బోనస్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడిపోతుంటాయి. బోనస్ ఇచ్చినట్లు బాగా గుర్తిండిపోవడానికి కొన్ని కంపెనీలు నగదు రూపంలోనూ ఇస్తుండొచ్చు. ఎంత బోనస్ అయినా జేబుకు సరిపోతుంది, లేకపోతే రెండు జేబుల్లో పెట్టేసుకోవచ్చు. కానీ జేబుల్లో, పర్సుల్లో పట్టనంత బోనస్ ఇస్తే? బోనస్ తీసుకెళ్లడానికి సంచులు తీసుకురమ్మని కంపెనీ చెబితే?
చైనాకు చెందిన హైనాన్ మైన్ అనే కంపెనీ ఈ మాటే చెప్పింది.
WATCH: A company in central China has stirred controversy by piling up a mountain of 61 million yuan (S$11.8 million) in banknotes on a stage before handing out the cash in year-end bonuses. pic.twitter.com/MXippITBrT
— TODAY (@TODAYonline) January 31, 2023
బాగా కష్టపడి కంపెనీని లాభాల బాట పట్టించిన ఉద్యోగులకు సంచులకొద్దీ నోట్ల కట్టలను బోనస్‌గా సమర్పించుకుంది. ఉద్యోగులు రెండు చేతుల నిండా, సంచుల నిండా క్యాష్ మోసుకెళ్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. హైనాన్ మైన్ మొత్తం రూ.73కోట్ల బోనస్ ప్రకటించింది. బాగా పనిచేసిన ముగ్గురు ఉద్యోగులకు దాదాపు రూ. 6 కోట్ల చొప్పున, ఒకమేరకు కష్టపడిన మరో 30 మందికి రూ.1.20 కోట్ల చొప్పున నజరానా ఇచ్చింది. ఈ డబ్బును బ్యాంకు ఖాతాల్లో వేస్తే కంటికి కనిపించిన ఫీలింగ్ ఉండదని నగదు కట్టలను రెండుమీటర్ల ఎత్తున గుట్టగా పేర్చి పంచారు. మాంచి విందు కూడా ఇచ్చింది.