ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్న చైనా దేశంలోని ఓ కంపెనీ తమ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్లు ప్రకటిస్తోంది. బీజింగ్‌లోని దబీనాంగ్ టెక్నాలజీ గ్రూప్ అనే సంస్థ తమ ఉద్యోగుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళకు రూ.11 లక్షల బోనస్‌తో పాటు ఏడాది పాటు సెలవు లభిస్తుంది. ఇదే విషయంలో పురుషుడికైతే రూ.11 లక్షల రివార్డ్, 9 నెలల సెలవు మాత్రమే లభిస్తుంది. ఇక సంస్థలో పని చేసే ఉద్యోగులు మొదటి బిడ్డను కంటే రూ.3.50 లక్షలు(30,000 యువాన్లు), రెండో బిడ్డను కంటే రూ.7 లక్షలు (60,000 యువాన్లు), మూడో బిడ్డను కంటే రూ.11.50 లక్షలు(90,000ల యువాన్లు) బోనస్‌గా ఇచ్చి, ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు ప్రోత్సాహకాలను అందిస్తోందా కంపెనీ .
కారణమేంటంటే.. దేశ జనాభాను నియంత్రించేందుకు 1980లో చైనా ప్రారంభించిన వన్ చైల్డ్ పాలసీ చైనా జనన రేటు చాలా తగ్గింది. దీంతో ప్రభుత్వం వన్ చైల్డ్ పాలసీని 2016లో అధికారికంగా రద్దు చేసింది. 2027 నాటికి జనాభా పరంగా చైనాను భారత్ దాటేస్తుందని ఐరాసతోపాటు చైనా కూడా అంచనా వేసింది. దీనివల్ల వినియోగ డిమాండ్ తగ్గిపోతుందని భావించిన చైనా ప్రభుత్వం అందుకనుణంగా తన విధాన నిర్ణయాలను మార్చుకుంది. అందుకనుగుణంగా 2021 మే నెలలో ముగ్గురు పిల్లల పాలసీని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే చైనాకు చెందిన దబీనాంగ్ టెక్నాలజీ గ్రూప్ కంపెనీ తమ ఉద్యోగులకు ఈ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది.