షావోమి 108 మెగాపిక్సెల్ ఫోన్ వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

షావోమి 108 మెగాపిక్సెల్ ఫోన్ వచ్చేసింది..

November 5, 2019

x Mi CC9 Pro .

మొబైల్ ఫోన్ టెక్నాలజీ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫోన్ల రంగంలో దూసుకెళ్తున్న చైనా కంపెనీ షావోమీ మరో సంచలనానికి తెరతీసింది. ప్రపంచంలోనే తొలిసారిగా 108 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌తో మొబైల్ కెమెరా రంగంలో కొత్త శకం మొదలవుతుందని పేర్కొంది. ఈ భారీ కెమెరా ఫోన్‌లను ఎంఐ సీసీ9 ప్రో పేరుతో చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో మిడ్‌నైట్ బ్లాక్, అరోరా గ్రీన్, స్నో అరోరా రంగుల్లో లభ్యం కానుంది. చైనా మార్కెట్‌లో ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ మెమొరీ వేరియెంట్ ధర రూ.28,235గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.31,280 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.35,315గా ఉంది. ఇండియాలో ఈ ఫోన్ ఎప్పుడు విడుదల కాబోతుందో తెలియాల్సి ఉంది.

 

ఎంఐ సీసీ9 ప్రో ఫీచర్లు

 

* 6.47 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే,

* స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్,

* 8 జీబీ ర్యామ్, 

* 3డీ గ్లాస్ బ్యాక్, 

* ఎన్‌ఎఫ్‌సీ, 

* 5260 ఎంఏహెచ్ బ్యాటరీ, 

* 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్,

* 108, 12, 5, 2, 20 మెగాపిక్సల్ రియర్ కెమెరాలు,  

* 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

* బ్లూటూత్ 5.0.