పది నిమిషాల్లో పెళ్లి.. తర్వాత కరోనా చికిత్స కోసం.. - MicTv.in - Telugu News
mictv telugu

పది నిమిషాల్లో పెళ్లి.. తర్వాత కరోనా చికిత్స కోసం..

February 6, 2020

chainna....

కరోనా ప్రభావం శుభాకార్యాలను కూడా వదిలిపెట్టడం లేదు. దీని కారణంగా ఓ డాక్టర్ వివాహ తంతు కేవలం 10 నిమిషాల్లోనే ముగిసింది. తన జీవిత భాగ్యస్వామితో కలిసేందుకు పెళ్లితో చుట్టాలు హడావిడి మధ్య జరగాల్సిన వేడుక సాధాసీదాగా జరిగిపోయింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే పెళ్లి చేసుకున్న వెంటనే తిరిగి అతడు తన విధుల్లో చేరిపోయాడు. కరోనా బాధితులకు చికిత్స అందిచడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ వివాహం గురించి అంతా చర్చించుకుంటున్నారు. 

చైనాలో ఈ వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో చైనాలోని వైద్యులందరూ.. వైరస్ సోకిన వారందరికీ చికిత్స అందించేందుకు నిమగ్నమయ్యారు. కనీసం విరామం కూడా తీసుకోకుండా బిజీ అయిపోయారు. ఇలాంటి సమయంలో శాండాంగ్‌లోని హెజె ప్రాంతానికి చెందిన లీ జింక్విన్  వివాహం దగ్గర పడింది. గతంలోనే అతని వివాహానికి ముహూర్తం పెట్టడంతో దాన్ని వాయిదా వేయలేక జనవరి 30న పెళ్లి చేసుకున్నాడు. ఆ వెంటనే తిరిగి విధుల్లో చేరిపోయాడు. దీనికి హొంగ్యాన్ కూడా అంగీకరించింది.ఈ విషయాన్ని స్థానిక మీడియా ప్రచురించడంతో అతన్ని అంతా అభినందిస్తున్నారు.