చైనా దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కొన్ని రోజుల క్రితం గ్వాన్‌డాంగ్‌లోని సైనిక స్థావరాన్ని సందర్శించి సైనికులను యుద్దానికి సిద్ధంగా ఉండాలని ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం చైనా.. తైవాన్‌పై సైనిక చర్యకు పాల్పడనుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చైనా సరిహద్దుల్లోకి భారీగా బలగాలను, ఆయుధాలను తరలించినట్లు తెలుస్తోంది.
డీఎఫ్-11, డీఎఫ్-15 క్షిపణుల స్థానంలో అత్యాధునిక హైపర్సోనిక్ డీఎఫ్-17 క్షిపణులను మోహరించినట్లు సమాచారం. ఈ మేరకు కెనడాకు చెందిన కన్వా డిఫెన్స్ రివ్యూ అనే సంస్థ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వెల్లడించింది. ఇటీవల తైవాన్ సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాలను పెంచింది. చైనాకు చెందిన 40 యుద్ధ విమానాలు తైవాన్ సరిహద్దు రేఖను దాటి వెళ్లాయి. తైవాన్‌కు మద్దతుగా ఇటీవల అమెరికా దక్షిణ చైనా సముద్రంలో మోహరిస్తోంది. అలాగే తైవాన్ భారీ స్థాయిలో ఆయుధాలు, డ్రోన్ల వంటి అత్యాధుని సామగ్రిని సైతం సమకూరుస్తోంది.