నిప్పుకోడిని పెంచుకుంటారని తెలుసు. కానీ దానికి భిన్నంగా వాహనంగా కూడా ఉపయోగించుకోవచ్చని చైనా బాలిక నిరూపించింది. ఆస్ట్రిచ్ (నిప్పుకోడి) వీపు భాగంలో బాలిక ఎక్కి కూర్చోగా కోడి దర్జాగా నడుచుకుంటూ వెళ్తోంది. బాలిక తన చేత్తో కోడి తలను తిప్పుతూ ఎటు వెళ్లాలో డైరెక్ట్ చేస్తోంది. యున్నాన్ ప్రావిన్సులో నివసించే బాలిక ఫిబ్రవరి 6న ఇలా నిప్పుకోడిపై స్కూలుకు వెళ్తుండగా, వీడియో తీసి నెట్టింట్లో పెట్టడంతో వైరల్ అవుతోంది. బాలికను స్కూల్లో దింపిన తర్వాత కోడి బయటకు వెళ్లిపోయింది. దీంతో చైనీయులు దేన్నీ వదలడం లేదని నెటిన్లు కామెంట్లు చేస్తున్నారు.