పిచ్చి ముదిరి పరాకాష్టకు చేరింది. గుర్తింపు కోసం వెర్రి వేషాలు వేసి జైలు పాలయ్యాడు ఓ యువకుడు. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం పాకులాడిన వికృత పనికి తెరలేపాడు. కొత్తదనం కోరుకోవడం తప్పులేదు కానీ..శృతి మించితే అభాసుపాలు కావాల్సి వస్తాది.
టీవీలో లైవ్ టెలీకాస్టింగ్లు ఇస్తూ 21 ఏళ్ల చైనా యువకుడు డబ్బులు సంపాదిస్తుంటాడు. ఇందుకోసం కొత్తకొత్త మార్గాలు ఎంచుకుంటాడు. ఈ క్రమంలోనే శ్మశానవాటికకు వెళ్లి శవపేటికలోని అస్థిపంజారాలను ముద్దాడు. తన స్నేహితుడు సాయంత మూడు శవపేటికలను ఓపెన్ చేసి పుర్రెలు, ఎముకలు బయటకు తీసి ముద్దులు పెడుతూ ఫోజులిచ్చాడు. ఈ దృశ్యాలు లైవ్ ప్రసారం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడికి 9 నెలల జైలు శిక్ష పడింది. గతేడాది మార్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వ్యక్తి సదరు శవపేటికల్లోని వారసులకు క్షమాపణలు చెప్పాడు.
సదరు వ్యక్తి తీసిన వీడియో తీసిన స్థలం మింగ్ రాజవంశం నాటిది. ఇక్కడే మియావో జాతి సమూహం “శవపేటిక గుహ”గా పిలిచే సాంప్రదాయక శ్మశానవాటిక ఉంది. ఈ వీడియో అన్మో అనే వీడియో ప్లాట్‌ఫారమ్‌లో కనిపించిన తర్వాత, ఫిబ్రవరి 16న లాంగ్లీ కౌంటీ పీపుల్స్ ప్రొక్యూరేటరేట్ అతనిపై అభియోగాలు మోపింది. మొదట్లో, పోలీసులు దీనిమీద అభియోగాలు మోపడానికి ఆసక్తి చూపలేదు. తర్వాత న్యాయశాఖ అధికారులు పట్టుబట్టి కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పోలీసులు దృష్టిసారించారు.