మాయాలేదు.. మంత్రంలేదు.. కనికట్టు అంతకంటే లేదు. అంతా బ్యాలెన్సింగ్ నైపుణ్యమే. ఇదే ఓ వ్యక్తిని అరుదైన కళలో నిపుణుడిని చేసింది. వస్తువులను ఒకదానిపై మరొకటి వరుసగా నిలబెట్టి తన విద్యను ప్రదర్శిస్తున్నారు. తాడుపై బ్యాలెన్స్ తప్పకుండా మనిషి తన బరువును తాను నియంత్రించుకుంటూ వెళ్తున్న కళ లాంటిదే ఇది కూడా. అయితే ఇక్కడ వస్తువుల బరువును అద్భుతంగా అదుపు చేస్తున్నాడు ఓ వ్యక్తి. చిన్న మూలన ఎలాంటి ఆధారం లేకుండా వాటిని నిలబెడుతున్నాడు. చైనాలోని పశ్చిమ షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న లియాచెంగ్ ప్రాంతానికి చెందిన వాంగ్ యెకున్ ఈ ఘనతను సాధించాడు. వస్తువులను అతడు ఒకదానిపై ఒకటి నిలబెడుతున్న తీరు అందరిని ఆకట్టుకుంటోంది.
Wang Yekun from Liaocheng City, east China's Shandong Province, seems able to balance everything. pic.twitter.com/WGWGvALmPB
— People's Daily, China (@PDChina) October 19, 2020
కంటింగ్ ప్లేయర్లు, పానలు తీసుకొని వాటికి ఒకదానిపై ఒకటి క్రమంగా పేర్చుతూ వచ్చాడు. ఏ మాత్రం కిందపడి పోకుండా బ్యాలెన్స్ చేసి వాటిని నిలబెట్టాడు. అంతే కాకుండా వాటికి దారం సాయంతో క్యాప్సికం కూడా తగిలించాడు. అయినా కూడా ఏ మాత్రం అవి పట్టు తప్పడం లేదు. అలాగే చెక్కపై ఓ గాజు సీసాను పెట్టి దానిలో ఓ ఇనుపరాడ్డు పెట్టి ఓ పెద్ద సిలిండర్‌ను జాగ్రత్తగా నిలబెట్టాడు. అంతే కాకుండా మూడు గాజు సీసాలను పెట్టి వాటిపై మరో సీసా ఉంచి కుట్టు మిషన్‌ను బ్యాలెన్స్ చేశాడు. గాజు సీసాలను కూడా ఒకదానిపై ఒకటి నిలబెట్టడం లాంటి అనేక అద్భుతాలను తన చేతులతో సులువుగా చేసేస్తున్నాడు.
ఇతర వస్తువుల శక్తిపై పూర్తి పట్టు సాధించడం అద్భుతమైన విద్య అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది చూసిన వారికి నిజంగానే అతడు కనికట్టు చేశాడేమో అనే అనుమానం కలుగుతుంది. కాగా, గతంలో పాలస్తీనాకు చెందిన ఓ యువకుడు కూడా గతంలో ఇలాగే వస్తువులను నిలబెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా అతి కొద్ది మంది మాత్రమే ఇలాంటి విద్యలో నైపుణ్యం ప్రదర్శిస్తుండటంతో నెటిజన్లును ఇవి ఆకట్టుకుంటున్నాయి.