వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు అదుర్స్ - MicTv.in - Telugu News
mictv telugu

వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు అదుర్స్

June 13, 2019

chinese mobile manufacturer Vivo Z1 Pro With 'In-Display Selfie Camera' to Launch in India Soon, Will Be Exclusive to Flipkart.

ప్రముఖ చైనీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో జెడ్ పేరుతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధమౌతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ కింద మొదట వివో జెడ్1 ప్రో ఫోన్‌ను లాంచ్ చేయనుంది కంపెనీ. వివో జడ్1 ప్రో స్మార్ట్‌ఫోన్ మొదట భారత మార్కెట్‌లోకే రానుంది. ఇందులో ఇన్‌డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. దీని ధర ఎంతనే విషయం తెలియాల్సి ఉంది.

వివో జెడ్1 ప్రో ఫీచర్లు

6.53 అంగుళాల స్క్రీన్,

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్,

8 జీబీ వరకు ర్యామ్,

128 జీబీ వరకు ర్యామ్,

రియర్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్,

5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ట్రిపుల్ రియర్ కెమెరా (16 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ),

16 ఎంపీ సెల్ఫీ కెమెరా.