కోవిడ్ రక్కసి మళ్లీ పంజా విసురుతోంది. చైనా లక్షల కేసులు, వేల మరణాలు సంభవిస్తున్నాయి. మనదేశంలో కూడా ప్రమాదకరంగా కాకపోయినా కేసుల సంఖ్య కొద్దికొద్దిగా పెరుగుతోంది. జనం మళ్లీ మాస్కులు వేస్తున్నారు. ఎప్పుడూ ఆ నీలిగుడ్డ మాస్కేనా? బోర్ కొడుతోంది గురూ, ఈసారి కొత్త రకం ట్రై చేద్దామంటున్నారు కొందరు.
గత కోవిడ్ సీజన్లో బంగారు మాస్కులు, బంజ్రాల మాస్కులు, చిప్ప మాస్కులు, అరటాకుల మాస్కులు వంటి బోలెడు ముసుగులు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాలాగా క్రియేటివిటీలో వాటికి మించిన మాస్క్ ఒకటి హల్ చల్ చేస్తోంది. ఇదేం ఖరీదైంది కాదు, జస్ట్ అట్టముక్క మాస్క్. కానీ దీని స్టయిలూ, గుటుక్కూ అదిరిపోయాయి. గద్దముక్కులా కనిపించే ఈ మాస్క్ కూడా కరోనాను సృష్టించినట్లు అపవాదు ఎదుర్కొంటున్న చైనావాళ్లే కనిపెట్టినట్టు తెలుస్తోంది. మాటల్లో చెప్పడం ఎందుకు మీరే ఈ వెరైటీ మాస్క్‌ను, వాడే విధానాన్ని చూసేయండి..
చూశారుగా ఎంత తేడాగా ఉందో. న్యూడిల్స్ వంటి పుల్లలతో తినే చైనావాళ్ల తిండిని ఈ మాస్క్ పెట్టుకుని సులువుగా తినేయొచ్చు. అయితే చేత్తో ముద్దలు చేసుకుని మింగే మనదేశం వాళ్లకు ఇది సూటవుతుందా మరి..
కరోనా కొత్త వేరియంట్ కు ధీటుగా కొత్త రకం మాస్క్. pic.twitter.com/jxQQuSQmnI
— CHANDRA REDDY GUDIPATI…✍️ (@GsrcgsrReddy) December 23, 2022