వీడియో : ప్రయాణీకులను కాపాడి చనిపోయిన రైలు డ్రైవర్.. త్యాగానికి జనం సెల్యూట్ - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : ప్రయాణీకులను కాపాడి చనిపోయిన రైలు డ్రైవర్.. త్యాగానికి జనం సెల్యూట్

June 7, 2022

అత్యంత వేగంతో పయనించే బుల్లెటు రైలు ప్రమాదానికి గురవగా, డ్రైవరు చాకచక్యంతో వ్యవహరించి 144 మందిని చావు నుంచి తప్పించాడు. కానీ, తన చావును మాత్రం తప్పించలేక, ప్రాణాలు కోల్పోయాడు. శనివారం చైనాలో జరిగిన బుల్లెట్ ట్రైన్ ప్రమాదంలో డ్రైవరు యాంగ్ యోంగ్ త్యాగాన్ని ఇప్పుడు ప్రజలు గుర్తించి అతనికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. రైల్వే అధికారుల కథనం ప్రకారం.. బుల్లెట్ ట్రైను సొరంగంలోకి ప్రవేశించగానే పట్టాల మీద రాళ్లు, మట్టిపెళ్లలు, బురద వంటివి ఉండటాన్ని డ్రైవరు గుర్తించాడు. వెంటనే అత్యవసర బ్రేకులు వేయగా, రైలు సుమారు 900 మీటర్ల దూరం వరకు వెళ్లి ఆ తర్వాత పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవరు చనిపోగా మిగతావారు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ నేపథ్యంలో డ్రైవరు యాంగ్ మృతదేహాన్ని అతని స్వస్థలానికి తరలిస్తుండగా, స్థానికులు వీధుల్లో నిలబడి సెల్యూట్ చేసి తమ నివాళులర్పించారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసి నెటిజన్లు తమ సంతాప సందేశాన్ని తెలియజేస్తున్నారు. కాగా, ఒకవేళ డ్రైవరు ముందుగా ప్రమాదాన్ని పసిగట్టక అలానే వెళ్లి ఉంటే మొత్తం 144 మంది తమ ప్రాణాలను కోల్పేయేవారు.