చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మెదడులో వ్యాధి - MicTv.in - Telugu News
mictv telugu

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మెదడులో వ్యాధి

May 11, 2022

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ దాదాపు రెండున్నరేళ్లుగా చైనాను వదిలి బయటికి రావడం లేదు. దీనికి చాలా మంది కరోనా ప్రభావమని, అంతర్గత కుమ్ములాటలు అని రకరకాలుగా అనుకుంటున్నారు. అయితే తాజాగా ఆయనకు మెదడుకు సంబంధించిన వ్యాధి సోకిందని ఆ దేశ మీడయా పేర్కొంది. 2019 మార్చిలో ఇటలీ, ఫ్రాన్స్ పర్యటనల్లో ఆయనకు అనారోగ్యం కలుగగా, అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

అయితే వ్యాధి తగ్గకపోవడంతో 2021లో ఆసుపత్రితో చేరినట్టు మీడియా తెలిపింది. ఈ వ్యాధిని ‘సెరిబ్రల్ అనూరిజం’ అని మెడికల్ పరిభాషలో అంటారని వెల్లడించింది. అంటే మెదడులోని రక్తనాళాల గోడల లోపలి కండరాల పొర వీక్ అవుతుంది. దీంతో రక్త సరఫరా మందగించి రక్తనాళాలు పగిలిపోయి మెదడు చుట్టూ రక్తస్రావం అవుతుంది. దీని వల్ల కోమాలోకి వెళ్లడమో లేక స్ట్రోక్ వచ్చి చనిపోవడమో జరుగుతుంది. ఈ వ్యాధి కారణంగానే కరోనా నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు విదేశీ అతిథులను జిన్ పింగ్ కలవలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.