Chinese President Jin Ping's daughter Mengji's photo leaked
mictv telugu

కూతురి ఫోటో, అడ్రస్ లీక్.. దారుణంగా శిక్షిస్తున్న జిన్ పింగ్

September 2, 2022

చైనాలో ఏం జరిగినా అది బయటి ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు. అలాంటిది ఓ యువకుడు ఏకంగా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూతరు ఫోటో, అడ్రస్‌లను లీక్ చేసేశాడు. అంతటితో ఆగక వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అసలే నియంత కమ్యూనిస్టు ప్రభుత్వం. ఇక జిన్ పింగ్ ఊరుకుంటాడా? ఆ యువకుడికి అప్పటినుంచి చుక్కలు చూపిస్తున్నాడు. 2019లో నియూ టెంగ్యూ అనే వ్యక్తి జిన్ పింగ్ కూతురు జీ మెంగ్జీ ఐడెంటిటీని బాహ్యప్రపంచానికి వెల్లడించాడు.

దీంతో మండిపోయిన జిన్ పింగ్ కోర్టు ద్వారా 14 ఏళ్ల జైలు శిక్ష విధించేలా చేశాడు. అప్పటినుంచి ఎలాగైనా బయటికి తీసుకురావాలని అతని తల్లి ఎంత ప్రయత్నించినా కుదరనీయడం లేదు. కనీసం వాదించేందుకు లాయర్లు కూడా ముందుకు రావడం లేదు. దాంతో జిన్ పింగ్‌కు ఆవేదనతో ఉత్తరం రాసింది కానీ, అక్కడ్నుంచి జవాబు మాత్రం రాలేదు. కాగా, రెండో భార్య అయిన పెంగ్ లియువాన్ ద్వారా జిన్ పింగ్‌కి కూతురు జీ మెంగ్జీ పుట్టింది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి తర్వాత చైనాలో ఐదేళ్లు ఉంది. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ చట్టం ఆధారంగా మళ్లీ అమెరికాకే వచ్చి రీసెర్చి విద్యార్ధినిగా జాయిన్ అయ్యిందని సమాచారం. కాగా, అమెరికాను శత్రుదేశంగా పరిగణిస్తున్న జిన్ పింగ్.. తన కూతురిని మాత్రం ఏకంగా శత్రుదేశంలోనే చదివించడం విశేషం.